Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు ..

సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు ..
ఆయన ఎస్సీ కుల దృవీకరణ పత్రం రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు
ఆయన పొందిన ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు అన్ని రద్దు
దయానంద్ కుల ద్రువీకరణను సవాల్ చేసిన ములుగు జిల్లా వాసి

సత్తుపల్లికి చెందిన కాంగ్రెస్ నేత గతంలో సత్తుపల్లి ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మట్టా దయానంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు . ఆయన ఎస్సీ మల పేరుతో తీసుకున్న సర్టిఫికెట్ పై ఫిర్యాదు రావడంతో కలెక్టర్ దర్యాప్తు జరిపించారు .ఆ దర్యాప్తు లో ఆయన ఎస్సీ కాదని తేలినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపీ గౌతమ్ ప్రకటించడం సంచలనంగా మారింది …

మట్లా దయానంద్ ఎస్సీ కుల దృవీకరణ పత్రం పొందటాన్ని సవాల్ చేస్తూ ఫిర్యాదు చేసిన ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన కొడారి వినాయక రావు చేసిన ఫిర్యాదు లోని పొందుపరిచినా అంశాలు పరిశీలించిన అనంతరం కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో దయానంద్ కు షాక్ తగిలినట్లు అయింది..

తప్పుడు మార్గంలో మట్టాదయానంద్ ఎస్సీ కుల ధృవీకరణపత్రం పొందరని , రాజ్యాంగ పదవుల కోసం పోటిపడ్డారని, ఎస్సీలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కును దయానంద్ పొందారని వినాయక రావు ఫిర్యాదు చేశారు .వినాయకరావు ఫిర్యాదుపై , వివిధ దశలలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్లార్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించి
నివేదికలను కలెక్టర్ కు సమర్పించారు .

వినాయకరావు ఫిర్యాదుపై మట్టా దయానంద్ ను విచారణకు పిలిచి, ఆదారాలు సమర్పించ వలసిందిగా ఆదేశించిన జిల్లా స్థాయి స్కృటినీ కమిటీ ముందు ఆయన ఎస్పీ(మాల) కమ్యూనిటీ కులానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారని సత్తుపల్లి తహసీల్దార్ తన నివేదికలో పేర్కొన్నారు .

కులాంత వివాహాలలో పిల్లలు ఏ కులాన్ని పొందుతారనే అంశంలో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులకు లోబడి మట్టా దయానంద్ ఎస్సీ కుల దృవీకరణ పొందుటకు, రిజర్వేషన్ హక్కు దక్కించుకొనుటకు అర్హుడుకాడని ఆదేశాలల్లో జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు . కుల ధృవీకరణ పత్రాల వివాదంలో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులను తమ ఆదేశాల్లో ఉటంకించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు . మాట్టాదయానంద్ ఎస్సీ కుల దృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్టూ, వివిధ జిల్లా శాఖ అధికారులకు వెంటనే సమాచారం పంపించారు …
దయానంద్ కలెక్టర్ తన కుల సర్టిఫికెట్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై దయానంద్ హైకోర్టు ను ఆశ్రయించనున్నట్లు సమాచారం ….

Related posts

తుమ్మలను, నన్ను ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారు: పొంగులేటి ఆరోపణ..

Ram Narayana

నామ గెలిస్తేనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు..హరీష్ రావు

Ram Narayana

డిసెంబరు 13 నుంచి భద్రాద్రిలో శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు

Ram Narayana

Leave a Comment