Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

చంద్రయాన్-3: ఇది దశాబ్దాల కృషి ఫలితమన్న రాహుల్ గాంధీ

చంద్రయాన్-3: ఇది దశాబ్దాల కృషి ఫలితమన్న రాహుల్ గాంధీ
ఈరోజు అద్భుత విజయం సాధించిన ఇస్రో బృందానికి అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నేత
ఇది మన శాస్త్రవేత్తల కష్టానికి ఫలితమని వ్యాఖ్య
1962 నుండి ప్రయోగాల్లో కొత్త ఆవిష్కరణలు చేపడుతోందని వెల్లడి

చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. ఈ రోజు అద్భుతమైన విజయం సాధించిందుకు ఇస్రో బృందానికి అభినందనలు అని, నిర్దేశించిన చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిందని, ఇది మన శాస్త్రవేత్తల కష్టఫలం, అలాగే దశాబ్దాల మన కృషి ఫలితమని పేర్కొన్నారు. 1962 నుండి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కొత్త ఆవిష్కరణలు చేపడుతోందని, కలలుగనే యువతకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు.

చంద్రయాన్-3 విజయం.. ఇస్రోకు నాసా శుభాకాంక్షలు
ఈ మిషన్‌లో భాగస్వాములైనందుకు హర్షం వ్యక్తం చేసిన నాసా
చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా నిలిచినందుకు శుభాకాంక్షలు
‘ఎక్స్’ వేదికగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ పోస్ట్

చంద్రయాన్-3 విజయంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు (ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శుభాకాంక్షలు తెలిపింది. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతమైనందుకు ఇస్రోకు శుభాకాంక్షలు, చంద్రుడిపై వ్యోమనౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంలో భారత్ నిలిచింది. ఈ మిషన్‌లో మీతో భాగస్వాములైనందుకు మాకు ఆనందంగా ఉంది’’ అని బిల్ ట్వీట్ చేశారు.

చంద్రయాన్-3 విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అత్యంత సమీపంలో వ్యోమనౌకను దింపిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. అమెరికా చైనా, సోవియట్ యూనియన్ తరువాత విజయవంతంగా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా కూడా నిలిచింది. ప్రస్తుతం చంద్రుడిపై దిగిన ల్యాండర్ సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తోంది. కాబట్టి.. ఒక రోజు మాత్రమే (చంద్రుడి కాలమానం ప్రకారం) కార్యకలాపాలు నిర్వహించగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, మరోసటి రోజు సూర్యోదయం తరువాత రోవర్ పునరుజ్జీవం పొందే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

చంద్రయాన్-3: చిరంజీవి, బాలకృష్ణ, కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే?
ఇది కచ్చితంగా అద్భుతమైన విజయమన్న చిరంజీవి
శాస్త్రవేత్తలకు, వారిని ప్రోత్సహించిన ప్రభుత్వానికి బాలకృష్ణ శుభాకాంక్షలు
సైకిళ్లపై ఉపగ్రహాలను మోసుకెళ్లడం నుండి ఇప్పటి వరకు అంటూ కమల్ హాసన్ ట్వీట్
దేశానికి, మానవాళికి గర్వకారణమని ప్రకాశ్ రాజ్

చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగు పెట్టడం భారత్‌కు కచ్చితంగా అద్భుతమైన విజయమని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. చంద్రయాన్-3 అపూర్వమైన, అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిందని, దీంతో భారత్ చరిత్ర సృష్టించిందన్నారు. శాస్త్రవేత్తలను అభినందిస్తున్న, ఈ సంతోషాన్ని జరుపుకుంటున్న కోట్లాదిమంది భారతీయుల్లో తాను చేరానన్నారు. చంద్రునిపై అమూల్యమైన ఆవిష్కరణలకు, రాబోవు రోజుల్లో మరిన్ని సైంటిఫిక్ మిషన్లకు ఇది మార్గం సుగమం చేస్తుందన్నారు.

చంద్రయాన్ -3 విజయవంతానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రుడిపై ఉన్న ఆసక్తికర అంశాలను మానవాళికి అందించడంలో ఇది ముందడుగు అన్నారు. చంద్రుడిపై నివాస యోగ్యత, నీటి లభ్యత, జీవరాసుల మనుగడకు సంబంధించిన సమాచారం ప్రపంచానికి చేరవేయడంలో భారత్ ముందు ఉంటుందన్నారు. ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి శుభాకాంక్షలు అన్నారు. శాస్త్ర, సాంకేతిక, భౌగోళిక, చంద్రమండల, అంతరిక్ష పరిశోధనల్లో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సైకిళ్లపై ఉపగ్రహాలను మోసుకెళ్లడం మొదలు చంద్రుడిపై ల్యాండ్ అయ్యే వరకు.. ఎంతటి అద్భుతమైన జర్నీ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఈ మేరకు నాడు సైకిల్ పైన ఉపగ్రహాలను మోసుకెళ్లిన ఫోటోను, ఇప్పుడు చంద్రయాన్ చంద్రుడిపై ల్యాండ్ అయిన ఫోటోను ట్వీట్ చేశారు. ఇస్రో దేశానికి గర్వకారణమన్నారు. మన అంతరిక్ష ప్రయోగాల్లో నిలిచిపోయే అద్భుతమైన రోజు ఇది అన్నారు. భారతీయులు చంద్రుడిపై నడిచే దూరం ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు.

చంద్రయాన్-3 విజయవంతం దేశానికి, మానవాళికి గర్వకారణమని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది మన విశ్వం రహస్యాన్ని అన్వేషించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

చంద్రుడిపై మ‌న అడుగు అద్భుత విజ‌యం.. మంత్రి పువ్వాడ..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 విజయవంతం కావడం చ‌రిత్ర‌లో అత్యంత అద్భుత ఘట్టమని, ఇది దేశం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండ్‌ అవ్వడం యావత్ ప్రపంచమే గర్వించదగ్గ విషయమని, దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందన్నారు.

చంద్రుడిపై మ‌న తొలి అడుగు ప‌డింది.. సాంకేతిక రంగంలో మ‌న ప‌య‌నానికి దారి తీస్తుందని, అనేక అద్భుత, విప్లవాత్మక మార్పులకు నాంది అవుతుందన్నారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాల‌కు అంకురార్ప‌ణ జ‌రిగింద‌న్నారు.

ఇది భార‌త జాతి గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యంగా పేర్కొన్నారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు, అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి పువ్వాడ శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలిపారు.

చంద్రుడిపై మ‌న అడుగు అద్భుత విజ‌యం

  • రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 విజయవంతమ‌వ‌డం చ‌రిత్ర‌లో అత్యంత అద్భుత విష‌య‌మ‌ని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై సునాయాసంగా అడుగిడింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. దీంతో చంద్రుడి పై మ‌న తొలి అడుగు ప‌డినట్లయింది. ఇది మ‌న విజయ కీర్తి పతాకంలో మరో మైలు రాయి వంటిదని అన్నారు. ఈ స్ఫూర్తితో భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాల‌కు అంకురార్ప‌ణ జ‌రగనుందని అభిప్రాయపడ్డారు. ఇది భార‌త జాతి గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యంగా రవిచంద్ర పేర్కొన్నారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు ఎంపీ శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలిపారు.

చంద్రయాన్3సక్సెస్ పట్ల కాంగ్రెస్ నేత పొంగులేటి హర్షం ..

చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపడంపట్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రచార కమిటీ కో -చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హర్ష వ్యక్తం చేశారు . బుధవారం సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు చందమామను చంద్రయాన్-3 ముద్దాడి అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటి చెప్పింది. ఇక నేటి నుంచి 14 రోజుల పాట జాబిల్లిపై రోవర్ పరిశోధనలు జరపనుంది. యావత్ భారత్ ప్రజలు ఇస్రో చేసిన ఈ ఘన విజయానికి శాల్యూట్ చేస్తున్నారు ..

Related posts

పెద్దలు కుదిర్చిన సంబంధం.. ఆన్‌లైన్‌లో భారతీయుడిని పెళ్లాడిన పాక్ యువతి

Ram Narayana

తైవాన్‌లో 24 గంటల్లో 80కి పైగా భూకంపాలు…

Ram Narayana

శ్వేతా సౌధంపై మరోసారి ట్రంప్…అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం …

Ram Narayana

Leave a Comment