Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తప్పు చేశావు కేసీఆర్ అనుభవించకతప్పదు ….. కూనంనేని ఫైర్…!

తప్పు చేశావు కేసీఆర్ అనుభవించకతప్పదు ….. కూనంనేని ఫైర్
-అధికారం కోసం ఎన్ని అడ్డదార్లు అయినా తొక్కే సామర్థ్యం కేసీఆర్ కే చెల్లుతుంది
-మోసం ,వెన్నుపోట్లు బీఆర్ యస్ పేటంట్
-మునుగోడు ఎన్నికల్లో సాగిలపడి …బీజేపీ వ్యతిరేక పోరాటం అంటూ నమ్మబలికావు
-పొత్తుల దగ్గరకు వచ్చే వరకు కమ్యూనిస్టలను మోసం చేశావు
-ఇండియా కూటమిలో ఉన్నారనేది సాకు మాత్రమే ..
-అలాంటప్పుడు చెరొక సీటు ఇస్తామని ఎందుకు అన్నట్లు

-తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిక 

కేసీఆర్ తప్పుచేశావు …అనుభవించకతప్పదు …అధికారం కోసం ఎన్ని అడ్డదార్లు అయినా తొక్కే సామర్థ్యం కేసీఆర్ కే చెల్లుతుంది…మోసం ,వెన్నుపోట్లు బీఆర్ యస్ పేటెంట్లు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సీఎం కేసీఆర్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు .సీట్లు ,ఓట్లకోసం వామపక్షాలు ఎప్పడు వెంపర్లాడలేదు …బీజేపీ వ్యతిరేకిగా లోకైక ప్రజాస్వామ్య వాదిగా చెప్పుకుంటున్నందున బీజేపీ వ్యతిరేక పోరాటంలో మీతో కలిసి పనిచేద్దామని అనుకున్నాం …కానీ మీ అసలు నైజం తెలిసింది..బీజేపీకి మీకు సంబంధాలు ఉన్నాయనే ప్రచారం నిజం చేస్తూ ఇండియా కూటమిలో మేము ఉన్నందున కమ్యూనిస్టులతో కలిసి వెళ్లడంలేదని ఒక పత్రిక రాసింది …రాసినవారికి తెలుసోలేదో …కమ్యూనిస్టులతో కల్సి పోటీచేస్తామని వారి నుంచి సిపిఐ ,సిపిఎం లతో సంప్రదించింది వస్త్రావం కదా ..? అని సాంబశివరావు ప్రశ్నించారు .. రెండు పార్టీలకు చెరొక సీటు ఇస్తామని అన్న విషయం ఆ పత్రిక రాయకపోవడం విచారకరమని అన్నారు . ఇండియా కూటమి అనేది సాకు మాత్రమే వారు ఎజెండా వేరే ఉంది .బీజేపీతో రహస్య అవగాహనా ఉంది . అందువల్లనే తమతో ఉండటం కేసీఆర్ కు ఇష్టం లేదు …ఆవిషయాన్ని నేరుగా చెప్పకుండా కుంటిసాకులు చెప్పడం బీఆర్ యస్ కే చెల్లిందని ధ్వజమెత్తారు .

తెలంగాణ సీఎం కేసీఆర్ కనీస రాజకీయ విలువలు పాటించలేదని సాంబశివరావు మండిపడ్డారు. వెన్నుపోటు ఎలా పొడవాలి, అధికారంలోకి ఎలా రావాలన్నదే మీ పని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ చేసిన తప్పుతో కుమిలిపోకుండా తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. 

హైదరాబాద్‌లో మీడియాతో కూనంనేని మాట్లాడుతూ.. ‘‘మేం ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో చేరి, మిత్ర ధర్మం పాటించలేదని ఒక పత్రికలో రాశారు. అలాంటప్పుడు పొత్తు వద్దని ప్రకటించాలి తప్ప.. ఒక సీటు ఇస్తామని ఎందుకు చెప్పాలి? ‘ఇండియా’ కూటమిలో చేరినందుకే పొత్తు నుంచి వైదొలిగామని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు.. ఒక సీటు ఇస్తామని ఎందుకు సంప్రదింపులు జరిపారు?” అని నిలదీశారు.

2004లో కాంగ్రెస్‌తో 2009లో టీడీపీతో కేసీఆర్‌‌ ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఎవరు బలంగా ఉంటే వాళ్లతో పొత్తు పెట్టుకుని, ఇప్పుడు తమను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 30 సీట్లలో సీపీఐకి 10 వేలకు పైగా ఓటు బ్యాంకు ఉందని కూనంనేని చెప్పారు. సెప్టెంబర్ 11 నుంచి తాము బస్సు యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించి.. సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.

Related posts

కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారూ?: వైఎస్ షర్మిల

Ram Narayana

2004లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఇంకా అభివృద్ధి జరిగేది: కేసీఆర్

Ram Narayana

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ….?తుమ్మలా…? పొంగులేటినా …??

Ram Narayana

Leave a Comment