Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెసులోకి తుమ్మల వస్తే రెడ్ కార్పెట్ తో స్వాగతం …మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి….!

  • కేసీఆర్ పై విమర్శలు …తుమ్మలపై పొగడ్తలు …కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి
  • కేసీఆర్ వద్ద కౌరవులు ఉంటే.. మా పార్టీలో పాండవులు ఉన్నారు: రేణుకా చౌదరి
  • బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనన్న రేణుకా చౌదరి
  • మోదీ, కేసీఆర్‌‌ ఇద్దరూ తోడుదొంగలేనని విమర్శ
  • బతుకమ్మ పేరుతో బొంతకు కూడా పనికిరాని చీరలు ఇచ్చారని ఎద్దేవా
  • తుమ్మల తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని వ్యాఖ్య
  • కేంద్ర మాజీమంత్రి ,కాంగ్రెస్ నేత ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేణుకాచౌదరి కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించారు …ఈసందర్భంగా ఆమె కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు …ఆయన ఓటమి ఖాయమన్నారు . ఈసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని విశ్వాసం వ్యక్తం చేశారు . బీజేపీ ,బీఆర్ యస్ పార్టీలు ఒక్కటేనని ,మోడీ , కేసీఆర్ తోడుదొంగలు అని ధ్వజమెత్తారు ..కాగా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై ప్రశంసలు కురిపించారు . ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు . ఆయన కాంగ్రెస్ లోకి వస్తున్నారటగా అని విలేకర్లు ప్రశ్నించగా …. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని మోస్ట్ వెల్ కం అంటూ స్వాగతం పలుకుతామన్నారు . ఆయనే కాదు ఎవరు వచ్చిన స్వాగతం పలుకుతామన్నారు ….
  • తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద కౌరవులు ఉంటే.. తమ పార్టీలో పంచ పాండవులు ఉన్నారని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. బతుకమ్మ పేరుతో బొంతకు కూడా పనికిరాని చీరలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని అన్నారు.
  • ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముత్తపురం, నిమ్మవాగు చెరువు, కిన్నెరసాని వరద బాధిత రైతులకు యూరియా బస్తాలను రేణుకా చౌదరి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్‌‌ ఇద్దరూ తోడుదొంగలేనని ఆరోపించారు. తెర ముందు నాటకలేస్తారని విమర్శించారు. ‘‘కేసీఆర్ ఎన్ని కథలు చెప్పారు. మాటలు కోటలు దాటిపోయాయి. పోడు భూములను కుర్చీ వేసుకుని కూర్చుని తానే ఇస్తానని అన్నారు. వచ్చారా? ఎప్పుడైనా?” అని ప్రశ్నించారు.
  • మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని రేణుకా చౌదరి ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్న వారికి స్వాగతం పలుకుతామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను తుమ్మల అభివృద్ధి చేశారని చెప్పారు.

Related posts

ములుగు అసెంబ్లీ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కేసీఆర్ ….!

Ram Narayana

తెలంగాణలో మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటన

Ram Narayana

మైనంపల్లికి బుజ్జగింపులు …బీఆర్ యస్ ముఖ్యనేత నుంచి ఫోన్ ….

Ram Narayana

Leave a Comment