జాతీయ రాజకీయ వార్తలు

అసదుద్దీన్ నోటా బీజేపీ మాటలు …

ఇండియా కూటమి బీజేపీకి ప్రత్యామ్నాయం కానే కాదు: ఒవైసీ

  • కాంగ్రెస్, బీజేపీ సుదీర్ఘకాలం దేశాన్ని పాలించాయన్న ఒవైసీ
  • కాంగ్రెస్, బీజేపీ ప్రమేయం లేని మూడో ప్రత్యామ్నాయం అవసరమని వెల్లడి
  • ఇండియా కూటమి ఓ పెద్దమనుషుల క్లబ్ అని వ్యాఖ్యలు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇండియా కూటమిపై స్పందించారు. ఇండియా కూటమి బీజేపీకి ప్రత్యామ్నాయం కానే కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించాయని, దేశంలో మూడో ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమిని ఓ పెద్ద మనుషుల క్లబ్ అని ఒవైసీ అభివర్ణించారు. 

“ఇండియా కూటమి ఓ ప్రత్యామ్నాయం అని నేను అనుకోవడంలేదు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలిస్తే, బీజేపీ ఓ 18 ఏళ్లు పాలించింది. ఇప్పుడు ఈ రెండు పార్టీల ప్రమేయం లేని మూడో ప్రత్యామ్నాయం దేశానికి కావాలి. మన యుద్ధం మనమే చేయాలి” అని ఒవైసీ పిలుపునిచ్చారు.

Related posts

ఖమ్మం లోకసభ నుంచే సోనియాగాంధీని పోటీచేయించాలనే ఆలోచనలో టీపీసీసీ ….?

Ram Narayana

ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం గల నేతలు బీజేపీలో లేరు: అతిషి

Ram Narayana

తమిళనాట కొత్తపొత్తులు …ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలు …

Ram Narayana