Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోని వీహెచ్, రేణుకాచౌదరి

  • 18న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగింపు
  • దరఖాస్తు చేసుకోని సీనియర్ నేతల్లో జానారెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, రేణుకా చౌదరి, నిరంజన్
  • సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ తనయుడు ఆదిత్యరెడ్డి

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు దాదాపు వెయ్యి మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగిసింది. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో దరఖాస్తు చేయడానికి చాలామంది అశావహులు తరలి వచ్చారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో పలువురు సీనియర్ నేతలు టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. దరఖాస్తు చేసుకోని సీనియర్ నేతల్లో మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రులు గీతారెడ్డి, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, నిరంజన్, కోదండరెడ్డి, మల్లు రవి వున్నారు.  

ఇదిలా ఉండగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎల్బీ నగర్ నుండి దరఖాస్తు చేసుకున్నారు. ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మల్ రెడ్డి రంగారెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి జానారెడ్డి ఇద్దరు తనయులు దరఖాస్తు చేశారు. సనత్ నగర్ నుండి మర్రి శశిధర్ తనయుడు ఆదిత్యరెడ్డి దరఖాస్తు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందడి.. కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు!

  • ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ పార్టీ 
  • చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు
  • నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కొడుకులు అప్లై
  • ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ దరఖాస్తు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అప్లికేషన్లకు ఈ రోజు చివరి రోజు కావడంతో భారీగా ఆశావహులు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు పోటెత్తారు.

నిన్నటివరకు 700 పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈరోజు వచ్చే అప్లికేషన్లతో కలిపి వెయ్యికి చేరే అవకాశం కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో 10 నుంచి 15 దాకా అప్లికేషన్లు వచ్చాయి. మరోవైపు ఒక్కో నేత ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఓకే కుటుంబ నుంచి వేర్వేరుగా దరఖాస్తు చేస్తున్నారు. 

నాగార్జున సాగర్ టికెట్ కోసం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకులు రఘువీర్‌‌ రెడ్డి, జైవీర్ రెడ్డి దరఖాస్తు చేశారు. మిర్యాలగూడ టికెట్ కోసం రఘువీర్ రెడ్డి అప్లికేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ సోదరుడు రంగారావు కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేశ్ రావు దరఖాస్తు పెట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ అప్లై చేశారు.

Related posts

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత బండి సంజయ్ ప్రశంస!

Ram Narayana

రైతుబంధును ఆపింది ముమ్మాటికీ కాంగ్రెస్సే…ఎంపీ రవిచంద్ర

Ram Narayana

తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించబోరు: విజయశాంతి

Ram Narayana

Leave a Comment