- కాంగ్రెస్ వాళ్లను ఏమీ అనొద్దని కార్యకర్తలకు బాల్క సుమన్ హితవు
- ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే
- మైండ్‌గేమ్‌లో భాగమేనని కాంగ్రెస్ మండిపాటు
బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు మనోళ్లేనని, ఆ పార్టీలో మన కోవర్టులు ఉన్నారని, కాబట్టి వారినేమీ అనొద్దని కార్యకర్తలకు హితవు పలికారు. పార్టీ అధిష్ఠానం తనకు చెన్నూరు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ బీఆర్ఎస్‌లోకి వచ్చారని, మిగతా వాళ్లు కూడా వస్తారని, అందరూ మనోళ్లేనని అన్నారు. అసలు విషయం ఏంటంటే.. మనమే కొందరిని పార్టీలోకి పంపించామని, ఈ విషయాన్ని బయట చెప్పొద్దని కోరారు.
బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మైండ్‌గేమ్‌లో భాగంగానే ఆయనీ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనూ చర్చనీయాంశమయ్యాయి.