తెలంగాణ రాజకీయ వార్తలు ..

తాను కొందరికి నచ్చవచ్చు మరికొందరికి నచ్చకపోవచ్చు …సీఎం రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు … తాను అందరికీ నచ్చాలనేమీ లేదని, కొందరికి నచ్చవచ్చు, ఇంకొందరికి నచ్చకపోవచ్చని అన్నారు. తనను ముఖ్యమంత్రిగా కూడా కొందరు అంగీకరించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఎవరూ వేలెత్తి చూపే పరిస్థితి తెచ్చుకోనని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు తననే ప్రశ్నిస్తారని ఆయన అన్నారు. ఇచ్చిన ప్రతి గ్యారెంటీని తప్పకుండా అమలు చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. కొందరు తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వారు అంతకు మించి ఏమీ చేయలేరని ఆయన అన్నారు. విమర్శలను పట్టించుకుంటే తాను ముందుకు వెళ్లలేనని ముఖ్యమంత్రి అన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తూ, గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ బీఫారంపై గెలిచారో, ఆ తర్వాత ఏ పార్టీలో చేరారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వారు ఎవరి హయాంలో మంత్రులయ్యారో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాలని ఆయన నిలదీశారు. మంత్రివర్గ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను ముఖ్యమంత్రి కలిశారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో నిర్వహించిన కుల గణన అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చింది. కుల గణన, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు, తదనంతర పరిణామాలపై చర్చించారని సమాచారం.

పీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా రాహుల్ గాంధీతో చర్చించారని సమాచారం. త్వరలో సూర్యాపేట, గద్వాలలో బహిరంగ సభలను నిర్వహిస్తున్నామని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు.

Related posts

అంతవరకే నా బాధ్యత: తెలంగాణ ముఖ్యమంత్రి అంశంపై డీకే శివకుమార్ వ్యాఖ్య

Ram Narayana

బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతుల ఆస్తులు రూ.4,300 కోట్లకు పైగా!

Ram Narayana

ఎన్నికల వేళ పార్టీకి భారీ షాక్ …టీడీపీకి కాసాని గుడ్ బై…

Ram Narayana