Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చారు.. చంద్రబాబుపై జగన్ విమర్శలు

  • అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారన్న జగన్
  • ప్రతి అడుగు కుట్రలు, కుతంత్రాలేనని మండిపాటు
  • అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆరోపణ

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర మొత్తం వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలేనని ఆరోపించారు. సొంత కొడుకుపై నమ్మకం లేకనే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించి శవ రాజకీయాలు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. 

సోమవారం నగరిలో జరిగిన కార్యక్రమంలో విద్యా దీవెన నిధులను సీఎం విడుదల చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.680.44 కోట్లను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, పిల్లనిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతి అడుగు కుట్రలు, కుతంత్రాలేనని మండిపడ్డారు. 

పుంగనూరులో అల్లర్లు సృష్టించారని, పోలీసులపై దాడి చేశారని చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఒక్క మంచి పథకమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా పాలన ఉండేదని దుయ్యబట్టారు.

రోజా, శాంతి మధ్య సయోధ్య కుదిర్చేందుకు జగన్ యత్నం

  • నగరిలో రోజా, శాంతి మధ్య విభేదాలు
  • ఇద్దరి చేతులు కలిపిన జగన్
  • చేతులు కలిపేందుకు ఇష్టపడని రోజా, శాంతి
Jagan tried to make friendship between Roja and Shanthi

నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి బటయటపడ్డాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే మంత్రి రోజా, మున్సిపల్ ఛైర్ పర్సన్ కేజే శాంతి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈరోజు నగరిలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రోజా, శాంతి మధ్య సయోధ్య కుదిర్చేందుకు జగన్ ప్రయత్నించారు. ఇద్దరి చేతులు పట్టుకుని కలిపారు. అయితే చేతులు కలిపేందుకు ఇద్దరూ ఆసక్తి చూపలేదు. చేయి కలిపిన వెంటనే రోజా తన చేతిని వెక్కి తీసుకోగా, రోజా ముఖాన్ని శాంతి అసలు చూడనే లేదు. దీంతో, సయోధ్య కుదిర్చేందుకు జగన్ చేసిన ప్రయత్నం విఫలమయిందనే చెప్పుకోవాలి. 

Related posts

చంద్రబాబుకు రిమాండ్ విధించింది కోర్టే కదా… ఇందులో జగన్ కక్ష సాధించింది ఎక్కడ?: సజ్జల

Ram Narayana

ఈ నెల 25న నామినేషన్ వేయనున్న సీఎం జగన్…

Ram Narayana

మంచి లాజిక్ పట్టుకున్న సినీ నటుడు పృధ్వి …

Ram Narayana

Leave a Comment