బీఆర్ యస్ కు తుమ్మల గుడ్ బై …?
తుమ్మల రాజకీయ అడుగులపై ఆసక్తి …కాంగ్రెస్సే అంటున్న అనుయాయిలు
బీఆర్ యస్ బుజ్జగింపులు … ససేమీరా అంటున్న తుమ్మల
అవమానపరిచి బుజ్జగింపులా అంటున్న అనుయాయిలు
బీఆర్ యస్ వైఖరిపై భగ్గుమంటున్న తుమ్మల వర్గం
తుమ్మల కాంగ్రెసులోకి వస్తామంటే ఆహ్వానిస్తామన్న భట్టి
కాంగ్రెస్ నుంచి పాలేరు నుంచి బరిలోకి ఖాయమంటున్న అనుచరులు
ఖమ్మంజిల్లాలో రాజకీయ దురందురదు .సుదీర్ఘకాలంపాటు మంత్రిగా చేసిన అనుభవం ,ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రధాతగా ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ యస్ కు దాదాపు గుడ్ బై చెప్పారు …అయితే ఆయన రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొన్నది . బీజేపీ సైతం ఆయనకు గాలం వేసినప్పటికీ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బీజేపీకి ఆదరణ లేకపోవడంతో బీజేపీ నేతలకు సున్నితంగానే తన అభిప్రాయాన్ని తుమ్మల చెప్పినట్లు సమాచారం…ఆయన అడుగులు కాంగ్రెస్సే వైపే అంటున్నారు తుమ్మల అనుచరులు …
ఇప్పటికే ఏఐసీసీ ప్రతినిధులు తుమ్మలకు టచ్ లోకి వచ్చారని తెలుస్తుంది…రాహుల్ గాంధీ సైతం తుమ్మలతో నేరుగా ఫోన్ లో మాట్లాడని అంటున్నారు … తుమ్మల తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించనప్పటికీ ఆయన అనుయాయిలు మాత్రం కాంగ్రెస్ లో చేరడం ఖాయమంటున్నారు ..తుమ్మలకు పార్టీ మారాల్సిన అనివార్యమైన పరిస్థితులను బీఆర్ యస్ కల్పించిందని అంటున్నారు తుమ్మల అంతరంగికులు …పార్టీ మార్పుపై తుమ్మల చాల సుదీర్ఘంగా ఆలోచించారని బీఆర్ యస్ టికెట్ ఇవ్వకుండా గెంటి వేయడంతో తప్పని పరిస్థితుల్లో పార్టీ మారక తప్పడంలేదని అంటున్నారు . ఆయన పార్టీ మరి పాలేరు లేదా ఖమ్మం నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం ఉంది…రెండు చోట్ల నుంచి పోటీచేయాలని ఆయన అభిమానులు వత్తిడి తెస్తున్నారు …
మంగళవారం కాంగ్రెస్ నేతలు తుమ్మలను కలిశారని ఆయన చర్చలు జరుపుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది…
తుమ్మల విషయంలో తప్పటడుగులు వేసిన బీఆర్ యస్ పునరాలోచనలో పడింది …దిద్దుకోలేనంత పొరపాటు జరిగిందని కొందరు బీఆర్ యస్ నేతలే అంగీకరిస్తున్నారు …ఆయన్ను బుజ్జగించెదనుకు చాలామంది నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలమైయ్యాయి. తనకు ఇప్పడు పిలిచి టికెట్ ఇచ్చిన ససేమీరా అంటున్నారు తుమ్మల ..తన రాజకీయ జీవితంలో ఇంతటి అవమానం ఎప్పడు జరగలేదని జిల్లాలోనేకాదు ఉమ్మడి రాష్ట్రంలో అనేకమందికి స్నేహితుడిగా ఉంది టికెట్స్ ఇప్పించిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు . కేవలం తన టికెట్ కోసం ఇంతగా తనను మానసిక క్షోభ పెట్టిన కేసీఆర్ వైఖరిపై గుర్రుగా ఉన్నారు . కొందరు మంత్రులు , ఎంపీలు ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వెళ్లినప్పటికీ సైతం ధైర్యాగం పార్టీలో ఉండమని ఎవరు ఆయన ముందు చెప్పలేక పోయారని సమాచారం …తుమ్మల బీఆర్ యస్ ను వీడటంతో ఇక ఖమ్మం జిల్లాలో వార్ వన్ సైడ్ అంటున్నాయి రాజకీయ వర్గాలు …ఇప్పటికే పొంగులేటి ప్రభావం ఉండగా , తుమ్మల తోడుకోవడం కాంగ్రెస్ సునామి ఖాయమని అంటున్నారు పరిశీలకులు …