- టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అన్న చంద్రబాబు
- చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ గేట్లు తెరవాలని తిరుగుతున్నాడన్న బొత్స
- ఉగాది తర్వాత టీడీపీ కనిపించదని వెల్లడి
- జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధే తమను గెలిపిస్తాయని ధీమా
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై బొత్స అదే స్థాయిలో స్పందించారు. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ గేట్లు తెరవాలని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు.
ఉగాది తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుచూపుమేరలో కనపడదని బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు ముసలి జిత్తులమారి నక్క అని అని అభివర్ణించారు. చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదని, మాజీ సీఎం అయిన వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడాలి? అని ప్రశ్నించారు. చంద్రబాబు వంటి దుష్టశక్తులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఏంటో తేలుతుందని బొత్స ధీమా వ్యక్తం చేశారు.
“చంద్రబాబు ఎవరితో కలుస్తారో మాకు అనవసరం. మేం ఒంటరిగా పోరాటం చేసి ప్రజలను మెప్పిస్తాం. జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమం, పథకాల వల్లే ధైర్యంగా ఈ విషయం చెప్పగలుగుతున్నాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం” అని బొత్స స్పష్టం చేశారు.
జీపీఎస్ లో మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు కోరాయి: మంత్రి బొత్స
ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ మూడున్నర గంటల పాటు చర్చించింది. ఈ సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని తెలిపారు. జీపీఎస్ లో మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు కోరాయని వెల్లడించారు. దీనిపై అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు చెప్పామని వివరించారు.