Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అందుకోసమేనా …?

-పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అందుకోసమేనా …?
-ముందస్తు ఎన్నికల ఆలోచనదిశగా బీజేపీ పావులు
-సెప్టెంబరు 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
-వచ్చే నెలలో 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
-అమృతకాల ఘడియల్లో సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కేంద్రం వెల్లడి
-ఇటీవలే ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నోటిఫికేషన్ కూడా వెలువడనుంది . అయితే వర్షా కాలం సమావేశాలు ముగిసి నెలరోజులు కూడా కాకముందే వచ్చే నెలలో ఐదు రోజుల అత్యవసర సమావేశాలు ఎందుకని ప్రశ్న వస్తుంది …ఇప్పటికే ప్రతిపక్షాలు ఇండియా పేరుతొ ఐక్యత సమావేశాలు నిర్వహిస్తున్న వేళ వారి మధ్య మరింత ఐక్యత రాకముందే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో కేంద్రం ఉందని రాజకీయ పండితుల అభిప్రాయం … వేంటనే ఎన్నికలు పెడితే తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ భావిస్తుందని అందువల్లనే పార్లమెంట్ సమావేశాలు పెట్టి బిల్లులు ఆమోదించుకోవడంతోపాటు …ప్రజలను ఆకర్షించే పథకాలు పెట్టడం , జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు , ఉమ్మడి పౌరస్మృతి లాంటివాటిపై ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ఎత్తులు వేయవచ్చునని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి….ఈనేపథ్యంలోనే వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అమృత కాల ఘడియల నేపథ్యంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు, ప్రసంగాలు ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.

కాగా, జులై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11తో ముగిశాయి. మణిపూర్ హింసపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, విపక్షాల ఇండియా కూటమి మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధాలు జరిగాయి. అంతలోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ఎందుకున్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఈసమావేశాల ఉద్దేశం ఎన్నికల అయివుంటుందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి…

Related posts

లోక్ సభలో గల్లా జయదేవ్, మిథున్ రెడ్డి మధ్య మాటల యుద్ధం

Ram Narayana

 పీఎం కిసాన్ మొత్తం పెంపు అంశంపై కేంద్రం స్పందన

Ram Narayana

పదేళ్ల ఎన్డీఏ పాలన పూర్తి.. మరో 20 ఏళ్ల పాలన మిగిలే ఉందన్న మోదీ…

Ram Narayana

Leave a Comment