Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖ ఎయిర్ పోర్టులో అయ్యన్నపాత్రుడు అరెస్ట్..విడుదల

  • గన్నవరంలో జగన్ ను, మంత్రులను తిట్టారంటూ కేసు
  • విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన అయ్యన్నను అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు
  • రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్న వైనం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో ముఖ్యమంత్రి జగన్ ను, ఇతర మంత్రులను పరుష పదజాలంతో దూషించారనే ఆరోపణలతో ఆయనను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. ఈ ఉదయం ఎయిర్ ఏషియా విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన 10.05 గంటలకు విశాఖకు చేరుకున్నారు. పావు గంట తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఆయన తన కారు వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఆయనను చుట్టుముట్టి, బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. అయ్యన్నను బలవంతంగా అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

నోటీసులు ఇచ్చి అయ్యన్నను విడుదల చేసిన పోలీసులు

  • విశాఖ ఎయిర్ పోర్టు వద్ద అయ్యన్నను అరెస్ట్ చేసిన పోలీసులు
  • విజయవాడకు తరలిస్తున్నారన్న సమాచారంతో టీడీపీ శ్రేణుల ఆందోళన
  • ఎలమంచిలి వద్ద అయ్యన్నను విడిచి పెట్టిన పోలీసులు
Police released Ayyanna Patrudu

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆయనను పోలీసు వాహనంలో తరలించారు. అనంతరం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద నేషనల్ హైవేపై ఆయను విడిచిపెట్టారు. అయ్యన్నను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారన్న సమాచారంతో నక్కపల్లి ప్రాంతంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ నేపథ్యంలో అయ్యన్నకు 41 (ఏ) నోటీసులు ఇచ్చి ఆయనను విడిచి పెట్టారు. అనంతరం నక్కపల్లి మండలం టోల్ ప్లాజా వద్ద ఉన్న కాగిత జాస్ హోటల్ కు అయ్యన్న, టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. గన్నవరం సభలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related posts

హైకోర్టు లేకుండా కర్నూలులో న్యాయ రాజధాని ఎలా సాధ్యం?: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Drukpadam

ఆసుపత్రి నుంచే వాదనలు వినిపించిన న్యాయవాది.. సుప్రీంకోర్టులో అరుదైన ఘటన!

Drukpadam

ఏసీ బోగీల్లో నీళ్లు బంద్.. చైన్‌లాగి నిరసన తెలిపిన రైల్వే ప్రయాణికులు

Drukpadam

Leave a Comment