Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ బీసీలకు సీటు ఇస్తుందా …? హ్యాండ్ ఇస్తుందా ..??

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ బీసీలకు సీటు ఇస్తుందా …? హ్యాండ్ ఇస్తుందా ..??
మాటతప్పితే బీసీల ఆగ్రహానికి గురికాకతప్పదు ..
మూడు జనరల్ సీట్లలో కనీసం ఒక అసెంబ్లీ సీటు ఇవ్వాలంటున్న బీసీ సంఘాలు
బీఆర్ యస్ నుంచి కొత్తగూడెంలో బీసీ అభ్యర్థిగా వనమా …
మిగతా పార్టీల నుంచి కూడా బీసీ లకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ …

అసెంబ్లీలో ప్రతిసారి ఉన్నత వర్గాలవారి ప్రాతినిధ్యం ఉంటుందని , జనాభాలో 52 శాతంగా ఉన్న బీసీ ప్రతినిధులు 17 మంది మాత్రమే ఉండగా …రెడ్డి , వెలమ , కమ్మ సామాజికవర్గాల జనాభా కేవలం 15 శాతం లోపు మాత్రమే ఉంటె 55 మంది ఎమ్మెల్యేలు ఉండటంపై బీసీ వర్గాల్లో చర్చజరుగుతోంది… ఇది చాల అన్యాయమని బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .. బీసీలను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి..అధికారంలో కూడా తమకు వాటా కావాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు .. బీసీలను ఐక్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి…అయినప్పటికీ పార్టీలు పట్టించుకోకుండా ఉన్నత కులాలవారికి టికెట్స్ ఇవ్వడమే కాకుండా వారిని మంత్రులను చేస్తున్నారు .. బీసీల్లోని మేథావులు , విద్యావంతులు దీనిపై మదనపడుతున్నారు …బీసీలను వెనకబడివారిగా చూపించడం,వారికీ పాలన చేతకాదని హేళన చేయడం …అధికారంలో తగిన ప్రాతినిధ్యం లేకపోవడంపై గుర్రుగా ఉన్నారు ….

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మంతోపాటు ,మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని భద్రాచలం , పినపాక , ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి… కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో రెండు నియోజకవర్గాలను బీసీ అభ్యర్థులకు ఇస్తామని ప్రకటించింది….దీంతో బీఆర్ యస్ కేవలం 22 మంది బీసీలకు మాత్రమే ఇవ్వడంతో బీసీల్లో కొంత అసంతృప్తి ఉంది..కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామని ప్రకటించింది… ఆలెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 34 మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంది..అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో జనరల్ స్థానాలు మూడు మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఏ పార్టీకైనా బీసీలకు సీటు ఇవ్వడం పరీక్ష లాంటిదే …బీసీలు గొంతెమ్మ కోరికలు ఏమి కోరడంలేదు …కనీసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు ఇవ్వమని కోరుతున్నారు …అదికూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే 50 శాతంపైగా ఉన్న బీసీల నుంచి కచ్చితంగా వ్యతిరేకత వస్తుంది…దాని ప్రభావం గెలుపోటములపై ఉంటుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి…

కాంగ్రెస్ లో సీట్ల కేటాయింపు ఇంకా జరగలేదు …ఉన్న మూడు నియోజకవర్గాలకు ఇప్పటికే గట్టి పోటీ ఉండగా కొత్తగా మాజీమంత్రి తుమ్మల , పొంగులేటిలకు తప్పని సరిగా సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ..అయితే బీసీలను కాదని ఉన్న మూడు సీట్లు ఉన్నత కులాలకు ఇస్తే బీసీలనుంచి వ్యతిరేకత రావడం ఖాయంగా కనిపిస్తుంది… ఖమ్మం ,పాలేరు నుంచి బీసీలు ఎవరు క్లయిమ్ చేయనప్పటికీ కొత్తగూడం నుంచి ఎడవల్లి కృష్ణ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు …ఆయన కాకుండా కమ్మ సామాజికవర్గానికి చెందిన పోట్ల నాగేశ్వరరావు , రెడ్డి సామాజికవర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు . ఇక్కడ సీటు ఎవరికీ ఇస్తారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కొత్తగూడం ,పాల్వంచ పట్టణాలు ట్విన్ సిటీలుగా ఉండి ,అనేక పరిశ్రమలతో కళాకలాడుతూ పారిశ్రామిక ప్రాంతంగా ఉంది… ఇక్కడ బీసీల జనాభా కూడా అధికంగా ఉంది…కాంగ్రెస్ సీటు బీసీలకు ఇస్తుందా లేక వారికీ హ్యాండ్ ఇస్తుందా…? అనేది చర్చనీయాంశంగా మారింది….చూద్దాం ఏమి జరుగుతుందో….!

Related posts

కాంగ్రెస్ లోకి మోత్కుపల్లి …బెంగుళూర్ లో డీకే శివకుమార్ తో భేటీ …!

Ram Narayana

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఫ్లెక్సీ వార్!

Ram Narayana

గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఈటల ప్రకటించడంతో కేసీఆర్‌కు దడ పుట్టింది: ధర్మపురి అర్వింద్

Ram Narayana

Leave a Comment