ఖమ్మం జిల్లాలో షార్ట్ లిస్ట్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే …!
దాదాపు వీరి నుంచే అభ్యర్థుల ఎంపిక
పాలేరు కోరుకుంటున్న తుమ్మల …ఖమ్మం రావాలంటున్న అభిమానులు
పొంగులేటి సీటు పై ఇంకారాని స్పష్టత ..
ఖమ్మమా …/ కొత్తగూడెం మా …?
డైలమాలో కోరం కనకయ్య
బెల్లయ్య నాయక్ లేదా రవికుమార్ వైపు మొగ్గు
బీసీ కార్డు తో ఏడవల్లికి అవకాశం
సత్తుపల్లి పై పంచాయతీనే ..మట్టా ఫామిలీ నా ..? సుధాకర్ కి అవకాశమా …??
పినపాక లో అదేతీరు …పాయంలేదా శ్రీవాణి
అశ్వారావుపేటలో తాటికి ఇస్తారా …? నాగమణి నితెస్తారా…??
వైరాలో విజయాబాయికి బరిలో విజయాబాయి ఉంటుందా ?…బాలాజీనాయక్ అంటారా ..??
ఎప్పుడా…ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ లిస్ట్ పై పీసీసీ ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తుంది…వచ్చిన 1006 దరఖాస్తులను వడపోసి ,వడపోసి చివరకు 300 పైగా లిస్ట్ తయారు చేసి ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తారు..దీనిలో ఉన్న పేర్లను సర్వేల ఆధారంగా ఒక్కరిని ఎంపిక చేసిన అనంతరం ఏఐసీసీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుంది…ఉదయపూర్ డిక్లరేషన్ పేరుతో కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్స్ లేవని కొందరు వాదిస్తున్న పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయని కాంగ్రెస్ పెద్దలు చెపుతున్నారు . ఉదాహరణకు కొత్తగా చేరిన పొంగులేటి , రేపు చేరబోయే తుమ్మల విషయంలో ఉదయపూర్ డిక్లరేషన్ అంతే కుదురుతుందా అంటే కుదరదని అంటున్నారు ..అందువల్ల బలమైన అభ్యర్థులను గెలిచేవారిని రంగంలోకి దించాలని అధిష్టానం భావిస్తుంది..అదే సందర్భంలో బీసీలకు కూడా తగిన విధంగా సీట్లు ఇవ్వాలనే దానిలో భాగంగా కొత్తగూడెం నుంచి టికెట్ ఆశిస్తున్నా పీసీసీ కార్యదర్శి ఎడవల్లి కృష్ణ కు అవకాశం ఉండవచ్చునని సమాచారం….
ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోని షార్ట్ లిస్ట్ పేర్లు ….
పాలేరు ….తుమ్మల నాగేశ్వరరావు /రాయల నాగేశ్వరరావు
ఖమ్మం …పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి/తుమ్మల నాగేశ్వరరావు /జావేద్
మధిర ….మల్లు భట్టి విక్రమార్క ఖరారు …
భద్రాచలం …పొదెం వీరయ్య దాదాపు ఖరారు ..
కొత్తగూడెం ….ఎడవల్లి కృష్ణ/పోట్ల నాగేశ్వరరావు/ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సత్తుపల్లి …..మట్టా దయానంద్ లేదా రాగమయి /సుధాకర్ /సంభాని చంద్రశేఖర్ /
ఇల్లందు …. బెల్లయ్య నాయక్ /డాక్టర్ రవి
పినపాక ….పాయం వెంకటేశ్వర్లు /శ్రీవాణి/ సూర్య /
అశ్వారావుపేట ….సున్నం నాగమణి /జారే ఆదినారాయణ /తాటి వెంకటేశ్వర్లు
వైరా ….విజయాబాయి /బాలాజీ నాయక్ /రాంమూర్తి నాయక్