Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మూడవసారి దీవించండి …మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించండి ..మంత్రి అజయ్ …!

మూడవసారి దీవించండి…మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించండి ..మంత్రి అజయ్ …!
నియోజకవర్గాల్లో ఎక్కడ వేలు పెట్టలేదు … ఖమ్మం అభివృద్దే ద్యేయంగా పనిచేశా …
రూ .2900 కోట్లతో ఖమ్మం అభివృద్ధి …ఇది నాకు లభించిన గొప్ప అవకాశం
నాకు సహకరించిన సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు
మూడవసారి గెలిపిస్తే మిగిలిన పనులు పూర్తీ చేస్తా…ఇక పువ్వాడ అజయ్ అవసరం ఖమ్మంనికి ఉండకూడదు …
ఖమ్మంనగరం వరదలకు గురికాకుండా రిటైనింగ్ వాల్
మున్నేరు పాత బ్రిడ్జి పక్కనే 180 కోట్లతో తీగల బ్రిడ్జి

గత రెండు టర్మలుగా 2014 ,2018 ఖమ్మం ప్రజలు దీవించి ఎమ్మెల్యేగా గె గెలించారని అన్నారు .ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా 9 సంవత్సరాలుగా ఖమ్మం ఎమ్మెల్యేగా ప్రజల సంక్షేమమే ద్యేయంగా , అభివృద్ధి లక్ష్యంగా పనిచేశాననే సంతృప్తి మిగిలిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు … ఇది తనకు దొరికిన అరుదైన అవకాశమని అన్నారు . తిరిగి సీఎం కేసీఆర్ ప్రకటించిన లిస్టులో తన పేరు ప్రకటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు తనపై విశ్వాసం ఉంచిన సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు .ఖమ్మం నుంచి తిరిగి పోటీచేస్తున్న తనను మూడవసారి దీవించి గెలిపించి మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని పువ్వాడ ఖమ్మం ప్రజలను కోరారు.

తనకు కేసీఆర్ తనమంత్రివర్గంలో చేర్చుకొని ఖమ్మంకు ఏది కావాలంటే అది ఇచ్చారని ,అందువల్ల నేడు ఖమ్మం అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందని సగర్వంగా చెప్పగలనని పువ్వాడ అన్నారు .కేసీఆర్ ఏ పని అప్పగించిన దాన్ని శిరసావహించి అమలు చేశానని ఉద్ఘాటించారు . ఎంపీ, ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ యస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషిచేశాని అన్నారు .ఎంపీ నామ ఎన్నిక, తర్వాత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , తాతా మధు ఎన్నికల్లో తన పాత్రను కేసీఆర్ ,కేటీఆర్ అభినందించారని అది నాజీవితంలో మరిచిపోలేనిది అన్నారు .ఖమ్మం అభివృద్ధికి ఎప్పడు నిధులు కాదనలేదని అన్నారు .దానికి తగ్గట్లుగానే ఖమ్మం అభివృద్ధి రాష్ట్రానికి రోల్ మోడల్ గా మారిందని అన్నారు . అందువల్లనే కేసీఆర్ , కేటీఆర్ ఎక్కడ చెప్పిన ఖమ్మం అభివృద్ధిని చూసి రమ్మని అధికారులకు , ప్రజాప్రతినిధులకు చెప్పడం, వారిని పంపించడం తనకు గర్వకారణం అని పువ్వాడ అభిప్రాయపడ్డారు . ఈసారి గెలిపిస్తే మరోసారి పువ్వాడ అజయ్ అవసరం ఉండకూడని అన్నారు .

76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి ఖమ్మం కు మంత్రి పదవి ..

దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ ,తెలుగు దేశం పార్టీలు అధికారంలోకి వచ్చాయి.కానీ ఖమ్మం నుంచి గెలిచినా ఎవరు మంత్రి కాలేదు …కేసీఆర్ మంత్రివర్గంలో నాకు చోటు లభించడం ఖమ్మం ప్రజలు చేసుకున్న అదృష్టం ..తనకు వచ్చిన అవకాశాన్ని ఖమ్మం అభివృద్ధికి నాశక్తి వంచనలేకుడా పనిచేశాను …ఖమ్మం రూపు రేకలు మార్చేందుకు సీఎం ఇచ్చిన సహకారం మరవలేనిది … ఇప్పటికే ఖమ్మం అభివృద్ధికి 2 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం .మరో 9 వందల కోట్లు రాబోతున్నాయి. మున్నేరు రిటైనింగ్ వాల్ ,మున్నేరు పాతబ్రిడ్జి పక్కనే కొత్తగా కేబులు రూ 180 కోట్లతో బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు …

మరోసారి గెలిపిస్తే ఖమ్మం ప్రజల అవసరాలు తీర్చుతా …!

రేపు జరగబోయే ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు దీవించి గెలిపిస్తే మిగిలిన ప్రజల అవసరాలు తీర్చుతానని అన్నారు . అందుకు అందరి సహకారం అవసరమన్నారు . ఎవరైనా ఊహించారా …ఖమ్మం ఇంతగా అభివృద్ధి చెందుతుందని కాల్వలు , డ్రైన్లు , డివైడర్లు , సెంట్రల్ లైటింగ్ , రోడ్ల వెడల్పు , ఫౌంటైన్లు ఏర్పాటు , పార్కుల అభివృద్ధి . కూరగాయల మార్కెట్లు , కొత్త బస్సు స్టాండ్ , ఐటీ హబ్ , అగ్రహారం వద్ద రైల్ బ్రిడ్జి , లకారం ట్యాంక్ బండ్, వాకింగ్ ప్యారడైజ్ ,నూతన కలెక్టరేట్ , ఖమ్మంకు మెడికల్ కాలేజీ , ముస్తఫా నగర్ , ఇల్లందు రోడ్ , ఎన్టీఆర్ సర్కిల్ , నూతన కార్పొరేషన్ కార్యాలయం , పాత మున్సిపల్ కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు ఒకటేమిటి చేసిన అభివృద్ధి చెప్పుకుంటే పొతే రోజులు సరిపోవని అన్నారు . ఒకప్పుడు మంచినీళ్ల కోసం పుంపుల దగ్గర కొట్టుకున్న అక్కచెల్లమ్మలకు ఇళ్లకే నీరు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు .

ఏ నియోజకర్గంలో ఎక్కడ వేలు ,కాలు పెట్టలేదు …

గతంలో మంత్రుల్లాగా జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎక్కడ కాలు వేలు పట్టలేదని ఎవరి పని వారు చేసుకొని పోయేవిధంగా వ్యవహరించానని అన్నారు . సీఎం కేసీఆర్ సలహా మేరకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉన్నానని అన్నారు . కానీ తనను హననం చేసేందుకు కొందరు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు . ఒకప్పుడు జిల్లాలో రాజకీయ హత్యలు జరిగేవని ఇప్పుడు వ్యక్తిగతంగా క్యారెక్టర్ దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని అన్నారు . గతంలో ఎమ్మెల్యేలుగా , ఎంపీలు చేసినవాళ్లు ఎక్కడైనా తట్టెడు పట్టి పోశారా అని ప్రశ్నించారు . ఒక చిన్న బోరు దగ్గరైన వారి శిలాఫలకం ఉందా అని అన్నారు . ఇక్కడ ప్రజలకు ఏమి చేయలేని వాళ్ళు కొత్త వేషాలతో వస్తున్నారని వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు .

నిరంతరం పదవి పట్టుకుని వేళ్ళాడే రకాన్ని కాదు ….

తనను రెండు సార్లు గెలిపించారు . మూడవసారి ఖమ్మం ప్రజల మద్దతు కోరుతున్నాను …వారి దీవించి గెలిపిస్తే మరింత సేవచేస్తా ….అయితే నిరంతరం తనకే పదవి కావాలని ,మరొకరి అవకాశం రావద్దని పదవిని పట్టుకొని వేళ్ళాడే రకం కాదు పువ్వాడ అజయ్ అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు . జీవితాంతం నేడు ఉండాలి అంటే ఎలా అని పదవులకోసం పాకులాలదే వారిపై సైటైర్లు వేశారు … మీడియా సమావేశంలో నగర మేయర్ పూనుకుళ్ళు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ కుమార్ , బీఆర్ యస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు పాల్గొన్నారు ..

కొంతమంది పార్టీని వీడితే నష్టమేమీ లేదు: పువ్వాడ అజయ్ కుమార్

కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. తమ బలం కేసీఆరే అన్నారు. తనకు గ్రూప్ రాజకీయాలు ఇష్టం లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామన్నారు. అభివృద్ధి మంత్రంతో తాము రానున్న ఎన్నికలకు వెళ్తామన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి బీఆర్ఎస్ ఒకటే స్థానం పొందిందని, ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి మెజార్టీ స్థానాలను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్టీసీని తన చేతుల మీదుగా విలీనం చేయడం గొప్ప వరమన్నారు.

Blessed for the third time…Give me a chance to develop more…Minister Ajay…!
Where did not put a finger in the constituencies… Worked for the development of Khammam…
Development of Khammam with Rs 2900 Crores…This is a great opportunity for me
Heartfelt thanks to CM KCR and Minister KTR who helped me
If we win for the third time, we will complete the rest of the work… Khammami should not need Puvwada Ajay anymore…
A retaining wall to prevent flooding of Khammanagaram
180 crore cable-stayed bridge next to Munneru old bridge

In the last two terms, 2014 and 2018, the people of Khammam blessed him and won as MLA. Minister Puvvada Ajay Kumar said that he was satisfied that he had worked as an MLA of Khammam for 9 years with the welfare and development of the people without betraying the trust of the people. He said that he is happy to announce his name in the list announced by CM KCR and said that he is thankful to Minister KTR for trusting him. Puvwada asked the people of Khammam to bless him and win for the third time and give him a chance to develop further.

Puvvada said that he included KCR in his ministry and gave whatever he wanted to Khammam, so today he can proudly say that Khammam has not developed wonderfully in all fields. He said that the MP and MLCs worked hard to win the BRS candidates in the local body elections. After the election of the MP’s name, then MLCs Palla Rajeshwar Reddy and Tatha Madhu, KCR and KTR appreciated his role in the election. He said that it will never be forgotten in his lifetime. He said that it has become a model. Therefore, Puvwada said that he felt proud to send officials and public representatives to come and see the development of Khammam where KCR and KTR said. Ajay said that if he wins this time, there will be no need to fight again.

For the first time in the 76-year history of independent India, Khammam has a ministerial position.

It has been 76 years since the country got independence. Congress and Telugu Desam parties came to power. But even if they won from Khammam, no one became a minister… I got a place in KCR’s cabinet. The people of Khammam were lucky. We have developed it with crores of rupees. Another 9 hundred crores are coming. He said that a new bridge will be constructed with cables costing Rs 180 crore next to the Munneru retaining wall and the old Munneru bridge.

If we win again, the needs of the people of Khammam will be fulfilled…!

He said that if the people of Khammam win the election tomorrow, he will fulfill the needs of the rest of the people. Everyone’s cooperation is needed for that. Did anyone imagine that Khammam would develop so much with canals, drains, dividers, central lighting, widening of roads, fountains, development of parks. Vegetable Markets, New Bus Stand, IT Hub, Rail Bridge at Agraharam, Lakaram Tank Bund, Walking Paradise, New Collectorate, Khammaku Medical College, Mustafa Nagar, Illandu Road, NTR Circle, New Corporation Office, Library at Old Municipal Office is one development. He said that Pothe days are not enough. He said that KCR deserves the honor of providing water to the homes of the elder sisters who used to go to the pumps for fresh water.

No finger or foot has been set in any constituency…

He said that like ministers in the past, he did not set foot anywhere in any constituency in the district and acted in such a way that they could do their work. He said that as per CM KCR’s advice, he is as far as necessary. But he expressed his grief that some people tried to hurt him. He said that once there were political murders in the district, now it is evil to try to damage the character of a person. He questioned whether the people who had served as MLAs and MPs in the past had been slapped anywhere. They said that there is a stone plaque near a small hole. He warned that people who cannot do anything here are coming in new guises and should be careful with them.

Not the type that keeps holding the post forever….

He won twice. I am asking for the support of the people of Khammam for the third time…If I win with their blessings, I will serve more….But Puvwada Ajay is not the type of person who always wants the position for himself and is not the type to hang on to the position so that no one else gets a chance. Pakulala made satires on them for the positions that they should be today for the rest of their lives… City Mayor Punukulu Neeraja, Suda Chairman Bachu Vijaya Kumar, BRS City President Pagadala Nagaraju participated in the media conference..

There is no harm in some people leaving the party: Puvvada Ajay Kumar

Telangana State Minister Puvwada Ajay said that there is no loss to the party if some people leave the party. He said that KCR is their strength. He said he does not like group politics. We will move forward under the leadership of KCR. With the mantra of development

Related posts

కాంగ్రెస్‌లో నేను ఉండకూడదా? ఎందుకింత శాడిజం?: జగ్గారెడ్డి ఆగ్రహం

Ram Narayana

కాంగ్రెస్‌లో చేరిన ఎల్లారెడ్డి చైర్మన్‌కు షాక్… అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్…

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు త్రీబుల్ ధమాఖా …భట్టి ,తుమ్మల, పొంగులేటికి కీలక పదవులు ..

Ram Narayana

Leave a Comment