Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కొత్తగూడంలో ఎంపీ వద్దిరాజు హంగామా …వనమాకు మద్దతుగా 500 కార్ల తో భారీ ర్యాలీ …

కొత్తగూడంలో ఎంపీ వద్దిరాజు హంగామా …వనమాకు మద్దతుగా 500 కార్ల తో భారీ ర్యాలీ …
సుజాతనగర్ నుంచి పెద్దమ్మగుడివరకు సాగిన ర్యాలీ …ప్రజల బ్రహ్మరథం …
కోలాటం ,డబ్ప్పు నృత్యాలు ,కొమ్ము డ్యాన్సులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రదర్శన
కొత్తగూడెంలో వనమా ను గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదన్న వద్దిరాజు
వనమా గెలుపు భద్రాద్రి రాజకీయాల్లో మలుపు కావాలని పిలుపు
కేసీఆర్ నాయకత్వంలో కొత్తగూడాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని విజ్ఞప్తి
భద్రాచలాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలురన్న ఎంపీ
ఒకే రోజు 4 లక్షల ఎకరాల పోడు భూములను పంచిన ఘనత కేసీఆర్ దేఅని స్పష్టికరణ
రైతు బంధు ,దళిత బంధు ఇస్తున్న సీఎం కేసీఆర్ కు అండగా ఉందామన్న వద్దిరాజు
దేశంలో ఎక్కడ లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటల విద్యత్ ఇస్తున్న రాష్ట్ర తెలంగాణ అన్న ఎంపీ

బీఆర్ యస్ ఎన్నికల రంగంలో వ్యూహాత్మకంగా దూసుకుపోతుంది. ఇప్పటికే నిత్యం ప్రజలతో ఉంటున్న బీఆర్ యస్ ఎమ్మెల్యేలు తిరిగి పోటీచేస్తుండటంతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు .ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంకు పార్టీ ఇంచార్జిగా నియమితులైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మొదటిసారిగా సోమవారం కొత్తగూడెం వెళ్లారు ..ఖమ్మం నుంచే హంగు ఆర్భాటాలతో వెళ్లిన వద్దిరాజుకు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు …గజమాలతో సత్కరించారు .కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్ నుంచి పెద్దమ్మగుడి వరకు ఎమ్మెల్యే వనంతో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ సుమారు 30 కిలో మీటర్ల ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది… ర్యాలీలో 500 పైగా కార్లు పాల్గొన్నాయి. ఇంకా నామినేషన్ వేయకముందే విజయోత్సవ ర్యాలీలా ఈ హంగామా కనిపించింది. దీంతో ప్రజలు పార్టీ కార్యకర్తలు వద్దిరాజు హంగామాపై ముచ్చటపడ్డారు … ప్రదర్శనలో కోలాటం , డప్పు నృత్యాలు , కొమ్ము డ్యాన్సులు ఈ ప్రదర్శనలో హైలెట్ గా నిలిచాయి…

కొత్తగూడెం లో బీఆర్ యస్ ర్యాలీ దృశ్యాలు …
పాల్గొన్న ఎంపీ వద్దిరాజు ,ఎమ్మెల్యే వనమా

ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ కొత్తగూడెంలో వనమా గెలుపును ఏశక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు .రాజకీయ కురువృద్ధుడు ,మాజీమంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వనమా గెలుపు కొత్తగూడెం రాజకీయాల్లో కీలక మలుపు కానున్నదని వద్దిరాజు పేర్కొన్నారు .కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడ వనమా ను గెలిపించి కానుకగా ఇస్తామని అన్నారు . ఇప్పటికే ప్రత్యేక జిల్లాగా కొత్తగూడెం ను ఏర్పాటు చేసిన కేసీఆర్ అభివృద్ధికి వేల కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు . మెడికల్ కాలేజీ , కలెక్టర్ , ఎస్పీ కార్యాలయం, కొత్తగా వచ్చాయని , బొగ్గుగనుల కేంద్రంగా కొత్తగూడెం ఉండగా , పారిశ్రామిక వాడగా ఉన్న పాల్వంచను మరింత అభివృద్ధి చేసుకోవాలనే కేసీఆర్ తిరిగి మూడవసారి అధికారంలోకి రావాలని పిలుపు నిచ్చారు . కేసీఆర్ సంక్షేమ పథకాలు అములు జరగాలంటే ,రైతుబంధు , దళితబంధు ,24 గంటల విద్యుత్ , కల్యాణ లక్ష్మి , షాదిముబారక్ , అమలు జరగాలంటే ,పేదలకు పెన్షన్ , రూపాయకు కిలో బియ్యం ,అమలు కావాలంటే బీఆర్ యస్ అధికారం అవసరమని అన్నారు .

గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు ఒకే రోజు పోడు భూములు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు .స్కాముల ప్రభుత్వం కావాలా …? స్కీముల ప్రభుత్వం కావాలా అని ప్రశ్నించారు . ప్రజలకు అందుబాటులో లేని కొంతమంది డబ్బుసంచులు తీసుకోని వస్తున్నారని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వనమా కావాలా …? చుట్టపు చూపుగా వచ్చే వారు కావాలా అని అన్నారు .మోసపోతే గోసపడతామని గుర్తుచుకోవాలని కేసీఆర్ చెప్పే మాటలను గుర్తు చేశారు .. అంతకు ముందు వనమా వద్దిరాజులకు ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు .పెద్దమ్మగుడిలో పూజలు చేశారు …తనకు మద్దతుగా వచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే వనమా ప్రత్యేక కృతజ్నతలు తెలిపారు …

వద్దిరాజుకి గజమాలతో ఘన స్వాగతం..!

రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఇంఛార్జి వద్దిరాజు రవిచందర్ కు జూలూరుపాడు మండలకేంద్రంలోని మున్నూరుకాపు సంఘంనాయకులు బాపట్ల మురళి ఆధ్వర్యంలో మున్నూరుకాపు సంగం నాయకులు, బిఆర్ఎస్ నాయకులు, అభిమానులు సోమవారం భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్బంగా, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జై వద్దిరాజు నినాదాలతో హోరెత్తించారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం బయలుదేరిన ఆయనకు జూలూరుపాడు చంద్రుగొండ చౌరస్తా వద్ద జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, ఎంపీపీ లావుడ్య సోని, మున్నూరుకాపు సంఘం ప్రముఖులు బాపట్ల మురళి, రామిశెట్టి రాంబాబుల ఆధ్వర్యంలో వందలాది మంది అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవిచంద్ర రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం గులాబీ శ్రేణులు ఎంపీ వద్దిరాజుకు మున్నూరుకాపు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావులను గజమాలతో సత్కారం చేసిన అనంతరం కార్ల ర్యాలీతో కొత్తగూడెం బయలుదేరారు.

Related posts

మేం వదిలేసిన నాయకులను కాంగ్రెస్ తీసుకుంటోంది: మంత్రి హరీశ్ రావు

Ram Narayana

గీత దాటితే వేటు తప్పదు … కామారెడ్డి నేతలకు కేసీఆర్ వార్నింగ్ …

Ram Narayana

కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్

Ram Narayana

Leave a Comment