Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం జిల్లాలో కు తుమ్మల వెంట నడిచేందుకు సిద్ధపడుతున్న బీఆర్ యస్ నేతలు …!

ఖమ్మం జిల్లాలో కు తుమ్మల వెంట నడిచేందుకు సిద్ధపడుతున్న బీఆర్ యస్ నేతలు …!
నియోజకవర్గాల్లో తుమ్మల వెంట తాము అంటున్న లీడర్లు
రాష్ట్రంలోనూ తుమ్మల ప్రభావం …అనేకమంది నేతలు కాంగ్రెస్ వైపు చూపు
మండవ , వేముల వీరేశం , యెన్నం శ్రీనివాస్ రెడ్డి ,సంతోష్ కుమార్ ,మోహన్
ఈనెల 17 సోనియా సభలో నేతల చేరికకు రంగం సిద్ధం

మాజీమంత్రి , బీఆర్ యస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆపార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో రాజకీయాలు చరవేగంగా మారుతున్నాయి..అనేక మంది బీఆర్ యస్ నేతలు తుమ్మలకు జై కొడుతున్నారు .దీంతో తుమ్మల జ్వరం బీఆర్ యస్ కు పట్టుకుందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు …తుమ్మల ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతటా ఉంటుందని స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు . బీఆర్ యస్ కు దూరమైన తుమ్మలను రేవంత్ నేతృత్వంలోని ఒక బృందం కలిసి పార్టీలోకి ఆహ్వానించింది. తరవాత కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క , ఎన్నికల ప్రచార కమిటీ కో -చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి పార్టీలో చేరమని ప్రత్యేక ఆహ్వానం పలికారు …అందుకు సానుకూలంగా స్పందించిన తుమ్మల తాను ఒక్కడినే చేరకుండా తన సహచరులు ,స్నేహితులు , అభిమానులు అందరికి కాంగ్రెస్ లో చర్చలని నిర్ణయించుకున్నారు .దీంతో రంగంలోకి దిగిన అనేక మందితో రహస్య సమావేశాలు నిర్ణయించారు . అందరు తుమ్మల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు .

ఇప్పటికే కమ్మ సామాజికవర్గం కేసీఆర్ వైఖరిపై అసంతృప్తిగా ఉంది… తుమ్మల విషయంలో కేసీఆర్ చాల పొరపాటు చేశారని ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతగా ఉన్న తుమ్మల ను వదులుకోవడం బీఆర్ యస్ కు నష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో సీనియర్ నేత మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా తుమ్మల బాటలో పయనిస్తారని ప్రచారం జరుగుతుంది …

గత ఎన్నికల్లో బీఆర్ యస్ తరుపున నకిరేకల్ నుంచి పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ,మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి , కరీంనగర్ కు చెందిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే మోహన్ తదితరులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దపడినట్లు సమాచారం …ఈనెల హైద్రాబాద్ లో జరిగే కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో వారు సోనియా గాంధీ చేతులమీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి…

తుమ్మలను కలిసిన కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ నేతలు ….

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బయ్యారం మండలం గంధంపల్లిలోని ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి వెళ్తున్న సందర్భంగా ఇల్లందులో బేతంపూడి సొసైటీ చైర్మన్, కాంగ్రెస్ జిల్లా నాయకులు లక్కినేని సురేందర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పులి గళ్ళ మాధవరావు, తుమ్మల అనుచరుడు కనగల పేరయ్య ఇల్లందు జగదంబ సెంటర్ నందు శాలువా, పుష్పగుచ్చంతో ఆయనకు స్వాగతం పలికారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి అంటి ముట్టనట్లుగా ఉంటున్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, తుమ్మలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పులిగళ్ల మాధవరావు తుమ్మలను కలవడం ఇల్లందు పట్టణంలో చర్చనీయాంశమైంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా అనేక మంది బీఆర్ యస్ నేతలు తుమ్మల వెంట నడిచేందుకు సిద్ధమైయ్యారు ..

Related posts

ఆ మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Ram Narayana

రాహుల్ గాంధీ కొల్లాపూర్‌కు ఎందుకు వచ్చాడు?: కేసీఆర్ ప్రశ్న

Ram Narayana

ఉస్మానియా విద్యార్థుల ఆందోళనతో కేసీఆర్ దీక్ష రూటు మార్చారు: సీపీఐ నారాయణ

Ram Narayana

Leave a Comment