Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ టికెట్స్ లో మార్పులు కేసీఆర్ చెప్పారన్న ఎమ్మెల్యే రాజయ్య …!

మార్పులు చేర్పులు ఉంటాయని కేసీఆర్ చెప్పారు: ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్య

  • 119 నియోజకవర్గాలకు గాను 115 చోట్ల గతంలోనే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
  • స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యకు దక్కని టిక్కెట్
  • ఈ క్రమంలో మార్పులు చేర్పులు ఉండవచ్చునని ఆసక్తికర వ్యాఖ్యలు

బీఆర్ యస్ అధినేత సీఎం కేసీఆర్ ఒక్కసారిగా తెలంగాణాలో 119 నియోజకవర్గాలు ఉండగా అందులో 115 నియోజకవర్గాలకు ఒకేసారి ప్రకటించి చరిత్ర సృష్టించారు …7 సీట్టింగ్ లకు అవకాశం ఇవ్వలేదు ..మరో నాలుగు సీట్లు ప్రకటించాల్సిఉంది. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ సీటు ను ఆశించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు టికెట్ దక్కలేదు …దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు . ఆయన ప్రగతి భవనంపై వెళ్లి సీఎం కలిసే ప్రయత్నం చేశారు . ఆయన కలిశారో లేదో కానీ కేటీఆర్ ను కలిశారు …అక్కడ ఏమి జరిగిందో తెలియదు.. రెండు రోజుల క్రితం వరంగల్ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ ను లేశారు .రాజయ్య ను కలిసి బుజ్జగించే పనిని దాస్యం వినయ్ భాస్కర్ కు అప్పగించారు . ఆయన రాజయ్య ను కలిసి మాట్లాడిన తర్వాత రాజయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నెలలోనే తమ పార్టీకి చెందిన 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. 119 నియోజకవర్గాలకు గాను కేవలం నాలుగుచోట్ల మాత్రమే పెండింగ్‌లో ఉంచారు. స్వల్ప మార్పులు, చేర్పులతో మిగతా అన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటించారు. టిక్కెట్ దక్కని వారిలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉన్నారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు.

అయినప్పటికీ రాజయ్య టిక్కెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. తాజాగా బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అభ్యర్థుల లిస్ట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని అధినేత కేసీఆర్ చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యలో అటు వాళ్లు ఇటు… ఇటు వాళ్లు అటు కావొచ్చన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపే స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ అవుతుందన్నారు.

Related posts

ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం కరెక్ట్ అయినప్పుడు ప్రొఫెసర్ శ్రావణ్ ఎందుకు కరెక్ట్ కాదు ..కేటీఆర్

Ram Narayana

తెలంగాణ ఉద్యమంపై లోతైన చర్చ జరగాలి: రేవంత్ రెడ్డి!

Ram Narayana

గీత దాటితే వేటు తప్పదు … కామారెడ్డి నేతలకు కేసీఆర్ వార్నింగ్ …

Ram Narayana

Leave a Comment