Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఇంతకూ పొంగులేటి పోటీ శాసనసభాకా …? పార్లమెంట్ కా …??

ఇంతకూ పొంగులేటి పోటీ శాసనసభాకా …? పార్లమెంట్ కా …??
కాంగ్రెస్ లో సీట్ల సర్దుబాటు …నాయకులు ఎక్కువ సీట్లు తక్కువ
తుమ్మల చేరికతో అడ్జెస్ట్ మెంట్లు …పాలేరు పైన ఆయన ఫోకస్
ఆశలు సన్నగిల్లని రాయల నాగేశ్వరరావు …సిపిఎం సైతం పాలేరు వైపు చూపు
ఖమ్మంలో రంగంలో ఎవరు …? పొంగులేటినా …?తుమ్మలనా …??
పరిశీలనలో మహమ్మద్ జావేద్ …డీసీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నుంచి పోటీచేసే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా పై సస్పెన్స్ కొనసాగుతుంది…బీఆర్ యస్ నుంచి బయటకు వచ్చి హాట్టహాసంగా ఖమ్మం లో జరిగిన భారీ బహిరంగసభలో జులై 2 వ తేదీన రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు …పొంగులేటి చేరికతో జిల్లాలో బీఆర్ యస్ బలహీనపడి కాంగ్రెస్ బలం పెరిగింది.. శ్రీనివాస్ రెడ్డి తోపాటు మరికొందరు ఆయన చెప్పినవాళ్లకు కాంగ్రెస్ సీట్లు ఇస్తందని భావించారు . కానీ ఆయన సీటే నేడు ప్రశ్నర్ధకంగా మారింది.. అయితే ఇందులో ఒక ట్వీస్ట్ ఉంది.. మొదటి నుంచి ఆయన ఏ ఎన్నికలు ముందు వచ్చిన కచ్చితంగా పోటీలో ఉంటానని చెపుతున్నారు . బీఆర్ యస్ ను రాష్ట్రంలో ఓడించి కేసీఆర్ ను ఇంటికి పంపాలని గట్టిపట్టుదలతో ఉన్న పొంగులేటి కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నవారికోసం త్యాగం చేయాల్సి వస్తుందనే వాదన కూడా ఉంది…. ఒక వేళ ఆయన శాసనసభకు పోటీచేయకపోతే ఖమ్మం లోకసభకు పోటీచేయడం ఖాయంగా కనిపిస్తుంది…అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చే హామీని బట్టి ఆయన దేనికి ఎక్కడ నుంచి అనే అవకాశం ఉంది..ఇప్పడు తెలంగాణ శాసనసభతోపాటు మరో 11 రాష్ట్రాలకు , పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు వస్తాయని అంటున్నారు . అదే జరిగితే పొంగులేటి పార్లమెంట్ కు పోటీచేయడం ఖాయం అని సమాచారం ….అదే జరిగితే తెలంగాణ శాసనసభకు కూడా జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ కూడా సూచనప్రాయంగా చెప్పడం గమనార్హం …

పొంగులేటి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఆయనతోపాటు 7 రిజర్వడ్ నియోజకవర్గాలకు ఆయన నియమించిన ఇంచార్జిలు చేరారు ..వారి నుంచి భద్రాచలం ఇంచార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు పొంగులేటికి షాక్ ఇచ్చి తిరిగి బీఆర్ యస్ గూటికి చేరారు …అయితే ఆయనకు భద్రాచలం సీటు ఆఫర్ చేసి పార్టీలో చేర్చుకున్నారు .మరికొందరు పొంగులేటి అనుయాయులపై బీఆర్ యస్ గాలం వేసింది..ఇప్పటికి సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుంది..అయితే ఎంతమంది వారి ఆపరేషన్ కు ఆకర్షితులవుతారు అనేది ఉత్కంఠంగా మారింది. ఎన్నికల సమయంలో ఆయారాం గయారాంలు ఉంటారనేది సహజమే …సీటు ఆశించి రానివారు తప్పకుండ పార్టీ మారె అవకాశం ఉంది…

రెండు చోట్ల నుంచి తప్ప మిగతా చోట్ల నుంచి ఫలానా వ్యక్తం పోటీచేస్తారనే గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి …మధిర నుంచి భట్టి పోటీ ఖాయం కాగా ,భద్రాచలం నుంచి సీట్టింగ్ అభ్యర్థి పొదెం వీరయ్య పోటీ ఖాయం…మిగతా 8 నియోజకవర్గాల్లో మూడు జనరల్ నియోజకవర్గాలు ఉండగా ఐదు రిజర్వడ్ నియోజకవర్గాలు ఉన్నాయి..అందులో ఒకటి ఎస్సీ కాగా ,మరో నాలుగు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి… జనరల్ సీట్లలో ఎవరిని పోటీ పెడతారు .సమర్థులైన అభ్యర్థులు ఎవరు …? అనేది ఆసక్తిగా మారింది…

మాజీమంత్రి సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తాను ఎక్కడ నుంచి పోటీచేయాలని కోరుకుంటే అక్కడ సీటు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆయన పాలేరు పోటీచేస్తారా ..? లేక ఖమ్మం చేస్తారా అనేది ఆసక్తిగా ఉంది …ఆయన ఫలానావారికి సీటు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంలేదు …అయితే ఆయన కూడా సత్తుపల్లి , అశ్వారావుపేట నియోజకవర్గాలపై దృష్టి పెట్టె అవకాశం ఉంది…పొంగులేటి కూడా సత్తుపల్లి నుంచి జి .సుధాకర్ , అశ్వారావుపేట నుంచి జారే ఆదినారాయణ పేర్లను సిఫార్స్ చేస్తున్నారు . అయితే వారి పేర్లను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం తన సర్వేలద్వారా ఎవరు బెటర్ అనుకుంటే వారికీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది.. కొత్తగూడం నుంచి పోట్ల నాగేశ్వరరావు , ఎడవల్లి కృష్ణ ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీటు ఆశిస్తున్నారు . ఇల్లందు ఎస్టీ రిజర్వడ్ నుంచి కోరం కనకయ్య , డాక్టర్ రవి నాయక్ , బెల్లయ్య నాయక్ , పేర్లు పరిశీలనలో ఉన్నాయి…వైరా నుంచి బాలాజీ నాయక్ ,విజయాబాయి ,రాంమూర్తి నాయక్ ,బాలాజీ నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్న సిపిఐ తో పొత్తు ఉంటె వారి అభ్యర్థి పోటీలో ఉండే అవకాశం ఉంది…పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు , శ్రీవాణి ,సూర్య, పేర్లు పరిశీలనలో ఉన్నాయి.. ఒక పక్క బీఆర్ యస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకొని పోతుండగా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంలో మల్లగుల్లాలు పడుతుంది…

Related posts

కలిసి నడుద్దాం బి.ఆర్.ఎస్ ను ఓడిద్దాం – సి.పి.ఐ పాలేరు నియోజకవర్గ సమావేశంలో పొంగులేటి…

Ram Narayana

అసెంబ్లీ ఎన్నిలలో వీడియో గ్రఫీ చేసినవీడియో గ్రాఫ్రార్స్ బకాయిలు తక్షణమే చెల్లించాలి..

Ram Narayana

స్పీడ్ పెంచిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …మేము సైతం లో దూకుడు …

Drukpadam

Leave a Comment