Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పర్యాటక గుమ్మంగా ఖమ్మం ఖిల్లా…మంత్రి తుమ్మల

ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక గుమ్మంగా తీర్చిదిద్దుతామని, ఖమ్మం ఖిల్లా కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కిల్లా అభివృద్ధి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం సెక్రటేరియట్ లో పర్యాటక అభివృద్ధిపై, ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన రోప్ వే పనులపై తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి, ఎండీ ప్రకాశ్ రెడ్డి తో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం ఖిల్లా పై రోప్ వే నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టాలన్నారు.రోప్ వే బ్రిడ్జి లోయర్ పాయింట్ దగ్గర పార్కింగ్ కోసం, యంత్రాల తరలింపు కోసం స్థలం విశాలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోయర్ పాయింట్ నిర్మాణానికి లకారం చెరువు పరిసర ప్రాంతం అనువుగా ఉంటుందని , ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. టూరిజం హబ్ గా ఖమ్మం ఖిల్లా ను మార్చాలన్నారు. నిధులను సమకూర్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. రోప్ వే తో పాటు అమ్యుస్ మెంట్ పార్కులు, హోటళ్ల నిర్మాణాలు, వాటర్ ఫాల్స్, హాళ్ళ నిర్మాణం రెండో దశలో చేపట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ,ఖమ్మం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దక్షిణ అయోధ్య భద్రాద్రి లో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు అభివృద్ధి వస్తువుల కల్పనకు కృషి చేస్తామన్నారు ఖమ్మం జిల్లాలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, వైజ్ఞానిక యాత్రలకు శ్రీకారం చుడుతామన్నారు. నేలకొండపల్లి బౌద్ధ స్తూపం భక్త రామదాసు ధ్యాన మందిరం, కుసుమంచి శివాలయం టూరిజం సర్క్యూట్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. టూరిజం కార్పోరేషన్ ఎండి మాట్లాడుతూ, రోప్ వే పనులకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. వాటి నిర్మాణ పనులు చేపట్టడానికి ఈ రంగములో పేరెన్నికగన్న సంస్థలను సంప్రదించడం జరిగిందన్నారు.

Related posts

ప్రాణాలు తీసిన ఈత సరదా… తండ్రి ఎదుటే ముగ్గురు విద్యార్థులు మృతి

Ram Narayana

గెలుపు నాదే …రూ 400 కే సిలిండర్ …మహిళకు రూ 3 వేల పెన్షన్ …కందాల

Ram Narayana

రేపు భద్రాచలంలో బీజేపీ జాతీయనాయకుడు పొంగులేటి

Ram Narayana

Leave a Comment