- చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
- తమను షాక్ కు గురిచేసిందన్న పట్టాభి
- రిమాండ్ రిపోర్టులో ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని వెల్లడి
చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు ఏం తప్పు చేశారని రిమాండ్ విధించారని మండిపడ్డారు. 30 పేజీల రిమాండ్ రిపోర్టును పదిసార్లు చదివాను… ఎక్కడా చంద్రబాబు నేరం చేశారన్న దానికి ఆధారాలు చూపలేకపోయారని విమర్శించారు. ఏం తప్పు కనపడిందని చంద్రబాబుకు రిమాండ్ విధించారని ప్రశ్నించారు.
చంద్రబాబుకు రిమాండ్ అనే వార్తతో ప్రతి ఒక్కరూ ఎంతో వేదనకు గురయ్యారని పట్టాభి వెల్లడించారు. చంద్రబాబు తప్పకుండా బయటికి వస్తారని, మళ్లీ పార్టీ ఆఫీసుకు వస్తారని తాము ఈ ఉదయం నుంచి ఎదురుచూశామని, కానీ రిమాండ్ వార్త తమను షాక్ కు గురిచేసిందని తెలిపారు. ఆ వార్తతో ఎన్ని గుండెలు పగిలుంటాయో అని వ్యాఖ్యానించారు.