Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఇది మా కుటుంబానికి కష్టకాలం… అందరూ అండగా నిలవాలి: నారా భువనేశ్వరి

  • బయటకు వస్తుంటే నాలో ఓ భాగం అక్కడే వదిలేసినట్లుగా ఉందన్న భువనేశ్వరి
  • ఆయన జైల్లోనూ ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని వ్యాఖ్య
  • ఆరోగ్యంగానే ఉన్నానని, భయపడవద్దని తనకు ధైర్యం చెప్పారని వెల్లడి

జైల్లో ఉన్న చంద్రబాబును చూసి బయటకు వస్తుంటే నాలో ఒక భాగం అక్కడే వదిలేసినట్లుగా అనిపించిందని నారా భువనేశ్వరి అన్నారు. రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేతను కలిసేందుకు మంగళవారం భార్య నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి వచ్చారు. చంద్రబాబును కలిసి బయటకు వచ్చాక భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ… ఆయన ఉదయం నుండి రాత్రి వరకు నిత్యం ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి అన్నారు. తాను ఎప్పుడైనా అడిగితే.. తనకు ప్రజలే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని చెప్పేవారన్నారు.

రాజమండ్రి చేరుకున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, తేజస్విని, భరత్.. ఫొటోలు ఇవిగో!

  • స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు
  • ఈ సాయంత్రం చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు
  • ములాఖాత్ కు అనుమతినిచ్చిన జైలు అధికారులు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్ మెంట్  స్కాం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబును కలుసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రి వచ్చారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ ఈ మధ్యాహ్నం రాజమండ్రి చేరుకున్నారు. వారు ఈ సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి జైలులో చంద్రబాబును కలవనున్నారు. ఈ మేరకు జైలు అధికారులు ములాఖాత్ కు అనుమతి ఇచ్చారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశానికి హాజరైన బాలకృష్ణ

  • టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్
  • పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న బాలకృష్ణ
  • నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో భేటీ
  • ఇవాళ పోరంకిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
Balakrishna attends Combined Krishna district TDP leaders meeting

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ మరింత చొరవగా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలకృష్ణ టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. 

ఇవాళ పోరంకిలో జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశానికి బాలకృష్ణ హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే టీడీపీ నేతలపై అక్రమ కేసులు మోపి వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కేసులు పెడితే భయపడేది లేదని స్పష్టం చేశారు. నియంత పాలనపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సమరశంఖం పూరించారు. నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 

ఈ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతులను చేయాలని, దశల వారీగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర యువతలో తీవ్ర నిరాశ నెలకొని ఉందని, ఉద్యోగాలు లేక కొందరు గంజాయికి బానిసలవుతున్న పరిస్థితి ఉందని అన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, 2.30 లక్షల ఉద్యోగాలు ఏవని బాలయ్య నిలదీశారు.

Related posts

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, చిరంజీవి సహా ప్రముఖులు… వీరే

Ram Narayana

నేను జగన్ కు సహాయం చేశా… కానీ ఆయన నుంచి నేనెప్పుడూ సాయం అందుకోలేదు: రఘురామ

Ram Narayana

వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Ram Narayana

Leave a Comment