Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత

  • రేపు ఉదయం 6 వరకు ఉపాసవాస దీక్ష చేస్తానన్న కిషన్ రెడ్డి
  • ఈ రోజు సాయంత్రం వరకే అనుమతి ఉందన్న పోలీసులు
  • బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్రవాగ్వాదం
  • కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి, అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇందిరాపార్క్ వద్ద 24 గంటల ఉపావాస దీక్ష చేస్తోన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. తాను రేపు (గురువారం) ఉదయం వరకు దీక్ష చేస్తానని ఆయన చెప్పగా, పోలీసులు మాత్రం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి ఉందని చెబుతూ ఆయన దీక్షను భగ్నం చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి పోలీసులకు, కిషన్ రెడ్డికి మధ్య వాగ్వాదం కొనసాగింది.

ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలను పక్కకు తప్పించి కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు, కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తన దీక్ష కొనసాగుతుందన్నారు. శాంతియుత దీక్ష వల్ల పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

Related posts

2004లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఇంకా అభివృద్ధి జరిగేది: కేసీఆర్

Ram Narayana

ఆ గిన్నెలను కూడా నాకి నాకి సర్ఫ్ అవసరం లేకుండా చేశారు: బీఆర్ఎస్ నాయకులపై జగ్గారెడ్డి

Ram Narayana

గ్రాడ్యుయేట్ ఓట్లను కొనుగోలుకు బీఆర్ఎస్ యత్నిస్తోంది… రఘునందన్ రావు…

Ram Narayana

Leave a Comment