Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కిషన్ రెడ్డి చేత నిరాహారదీక్ష విరమింపజేసిన ప్రకాశ్ జవదేకర్

  • నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందంటూ కిషన్ రెడ్డి దీక్ష
  • 24 గంటల పాటు కొనసాగిన దీక్ష
  • నిన్న పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో కిందపడ్డ కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరాహారదీక్షను విరమించారు. ఆయనకు బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తొమ్మిదేళ్ల పాలనలో నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందని ఆరోపిస్తూ నిన్న ఉదయం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద 24 గంటల నిరాహారదీక్షను కిషన్ రెడ్డి చేపట్టారు. అయతే సమయం అయిపోయిందంటూ నిన్న సాయంత్రం ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన కిందపడ్డారు. అనంతరం ఆయనను నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తరలించారు. కిషన్ రెడ్డి దీక్ష చేపట్టి 24 గంటలు పూర్తి కావడంతో ఆయన చేత ప్రకాశ్ జవదేకర్ దీక్షను విరమింజేశారు.

Related posts

పాలేరులో పొంగులేటి …ఖమ్మంలో తుమ్మల పోటీ ఖరారు ….!

Ram Narayana

సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా పాలముర్రు బిడ్డ జాన్ వెస్లీ!

Ram Narayana

బీఆర్ యస్ పై భగ్గుమన్న కామ్రేడ్స్ …కేసీఆర్ మోసకారి అని అభియోగం…

Ram Narayana

Leave a Comment