క్రైమ్ వార్తలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

  • రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ
  • గతంలోనే కవితను విచారించిన ఈడీ
  • పిళ్లై అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో మరోసారి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం (రేపు) విచారణకు రావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో కవితను ఇప్పటికే ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారాడు. ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు ఈడీ అధికారులు రికార్డ్ చేశారని తెలుస్తోంది. ఈ కేసులో రామచంద్ర పిళ్లై కంటే ముందు శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరాలు అప్రూవర్‌గా మారారు. ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారింది.

Related posts

 సైబర్ నేరగాళ్ల నయా మోసం.. కరెంటు బిల్లు పెండింగ్ ఉందంటూ మెసేజ్‌లు.. స్పందిస్తే ఖేల్ ఖతం!

Ram Narayana

హాస్టల్‌ను బార్‌గా మార్చిన విద్యార్థులు….

Drukpadam

ప్రభుత్వ ఉద్యోగిపై బీఆర్ యస్ నేత ఆగడాలపై ప్రభుత్వ ఉద్యోగవర్గాల్లో చర్చ..

Drukpadam