- బెయిల్, మధ్యంతర బెయిల్… రెండు పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు
- రేపు కౌంటర్ దాఖలు చేయనున్న సీఐడీ
- ఈ రెండు పిటిషన్లు ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత తరఫు న్యాయవాదులు వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు. బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం రెండు పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. సీఐడీకి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఐడీ రేపు కౌంటర్ దాఖలు చేయనుంది. ఈ పిటిషన్లు ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశముంది.