Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ గారు మీకో నమస్కారం ….తుమ్మల

బీఆర్ యస్ తో తుమ్మల తెగదెంపులు ….కేసీఆర్ కు రాజీనామా లేఖ…
పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లైన్ క్లియర్
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తుమ్మల
ఇంతకాలం తనకు సహకరించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన వైనం
సాయంత్రం సోనియా ,మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల
తుమ్మలతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆపార్టీతో తెగదెంపులు చేసుకున్నారు ..ఈ మేరకు పార్టీకి గుడ్ బై చెబుతూ, రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదములు. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను’ అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తనకు బీఆర్ఎస్ టికెట్ ను కేసీఆర్ ఇవ్వకపోవడంపై తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే. మరోవైపు తుమ్మల కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు. ఈ సాయంత్రం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,సోనియా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

సుదీర్ఘకాలంపాటు టీడీపీతో కొనసాగిన తుమ్మల తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ పిలుపు మేరకు 2015 లో టీఆర్ యస్ పార్టీలో చేరారు … ఎమ్మెల్సీగా , మంత్రిగా ఉపఎన్నికల్లో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు . 2018 ఎన్నికల్లో మంత్రిగా ఉన్న తుమ్మల టీఆర్ యస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాల్లో ఓటమి పాలైయ్యారు . నాటినుంచి కేసీఆర్ తో అప్పుడప్పుడు కలిసినప్పటికీ మనసు విప్పి మాట్లాడుకున్న సందర్భాలు లేవు …పాలేరు లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ యస్ తీర్థం పుచ్చుకోవడంతో పాలేరు పై పెత్తనం అంతా ఉపేందర్ రెడ్డికి అప్పగించడంతో తుమ్మల ,ఉపేందర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది…ఎమ్మెల్యేకి ఇచ్చే ప్రాధాన్యత తుమ్మలకు లేకుండా పోయింది… పార్టీకి దూరంగా ఉంటున్న తుమ్మలను గత జనవరిలో ఖమ్మంలో జరిగిన బీఆర్ యస్ గర్జన సభకు రావాలని అందులో భాద్యతలు పంచుకోవాలని కేసీఆర్ సూచనమేరకు స్వయంగా మంత్రి హరీష్ రావు తుమ్మల ఇంటికి వెళ్లి ఆహ్వానించారు . ఆసభ కార్యక్రమాల్లో ఆయన యాక్టీవ్ పాల్గొన్నారు . తరవాత ఖమ్మం దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించేందుకు వచ్చిన కేసీఆర్ తుమ్మలను హెలికాఫ్టర్ లో తన వెంట హైద్రాబాద్ కు తీసుకోని వెళ్లి సీతారామ ప్రాజక్ట్ పై ఉన్నతాధికారులాటి సమీక్షా నిర్వహించారు …ఇక తుమ్మలకు బీఆర్ యస్ మంచి రోజులు ఉన్నాయని ఆయన అనుయాయులు భావించారు . కానీ తీరా కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తిరిగి కందాలకే పాలేరు సీటు ఇవ్వడంతో తుమ్మల తనకు జరిగిన అవమానంగా భావించారు .దీంతో పార్టీకి నాడే గుడ్ బై చెప్పారు .గులాబీ పార్టీతో 8 సంవత్సరాల ప్రయాణానికి అధికారికంగా గుడ్ బై చెపుతూ కేసీఆర్ కు రాజీనామా లేక పంపించారు . ఇప్పడు జిల్లా రాజకీయాల్లో ఇది కీలక ఘట్టంగా మారింది…తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయగలడని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరాలని ఆపార్టీ పెద్దలు ఆహ్వానించారు . అందుకు సమ్మతి తెలిపిన తుమ్మల కాంగ్రెస్ లో చేరి పాలేరు నుంచి పోటీచేస్తారని వినికిడి కాంగ్రెస్ పెద్దల దగ్గర కచ్చితమైన హామీ పొందిన తర్వాతనే ఆయన పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.. చూద్దాం ఆయన ఎక్కడ పోటీచేస్తారు …ఉమ్మడి జిల్లాను ఏవిధంగా ప్రభావితం చేస్తారనేది …!

Related posts

కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు పోవడంతో వారి ఆటలు సాగడం లేదు: మంత్రి సీతక్క

Ram Narayana

ఎన్నికలకు సిద్ధంకండి: కిషన్ రెడ్డి

Ram Narayana

ఆ వార్తలు రావడంతో మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు: బీజేపీ నేత రఘునందన్ రావు

Ram Narayana

Leave a Comment