జాతీయ వార్తలు

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా…దేశ విదేశాల్లో ప్రదర్శనలు !

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా…దేశ విదేశాల్లో ప్రదర్శనలు !
హైదరాబాదులో కుటుంబ సభ్యులతో కలిసి కార్లలో రోడ్లపైకి వచ్చిన ఐటీ ఉద్యోగులు
స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్న ఐటీ ఉద్యోగులు
ఇవాళ, రేపు హైదరాబాదులో కార్ల ర్యాలీ చేపట్టాలని ఐటీ ఉద్యోగుల నిర్ణయం
అమెరికాలో నిరసనలు ,బెంగుళూరులో టెక్కీల ప్రదర్శనలు

టీడీపీ అధినేత అరెస్ట్ అక్రమం అంటూ ఐటీ ఉద్యోగులు గళమెత్తుతున్నారు. ఐటీ ఉద్యోగులు నిన్న బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించడం తెలిసిందే. ఇవాళ హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంత కార్లలో రోడ్లపైకి వచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. దేశవిదేశాల్లోను చంద్రబాబుకు మద్దతు పెరుగుతుండడం గమనార్హం….ఆయన విజనరీ నాయకుడని తమ కుటుంబాల్లో వెలుగు నింపిన మహానేత అని అలంటి వ్యక్తిపై

చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ జీవితాలకు దారి చూపిన వ్యక్తిని అరెస్ట్ చేయడం సరికాదని గళం వినిపించారు. ప్రజల్లో ఉండాల్సిన నాయకుడిని జైలులో ఉంచుతారా? విజనరీ లీడర్ ను అక్రమ కేసులతో వేధిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ఐటీ ఉద్యోగులు నానక్ రామ్ గూడ నుంచి కార్లతో ర్యాలీగా బయల్దేరగా, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓఆర్ఆర్ పై కార్ల ర్యాలీకి అనుమతి లేదని నిరసనకారులకు పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్-ముంబయి జాతీయ రహదారిపై ఎగ్జిట్-3 వద్ద ర్యాలీకి అంతరాయం ఏర్పడింది. ఐటీ ఉద్యోగులను ఎగ్జిట్-3 నుంచి వారి కార్లతో సహా బయటికి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఇవాళ, రేపు 10 వేల మందితో కార్ల ర్యాలీ నిర్వహించాలని ఐటీ ఉద్యోగులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మేమేమీ జీతాల పెంపు కోసం నిరసన చేయట్లేదు.. ఆఫీసు పనివేళ్లలో అసలే కాదు: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేయొద్దన్న టెక్ మహీంద్రపై ఉద్యోగి ఫైర్

Tech Mahindra Employee Viral Post On Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్, బెంగళూరులోని ఐటీ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు అలాంటివి చేపట్టకుండా చూడాలంటూ ఆయా కంపెనీలను పోలీసులు కోరారు. దీంతో నిరసనల్లో పాల్గొనవద్దంటూ టెక్ కంపెనీలు ఓ సర్క్యులర్ జారీ చేశాయి.

టెక్ మహీంద్ర ఇలా జారీ చేసిన ఓ సర్క్యులర్‌పై ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తామేమీ వేతనాల వార్షిక పెంపు కోసమో, దీపావళి కానుకల కోసమో, అదనంగా పనిచేసిన కాలానికి చెల్లింపుల కోసమో నిరసనలకు దిగట్లేదని, మరీ ముఖ్యంగా ఆఫీసు అవర్స్‌లో అస్సలే చేయట్లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఓ ఉద్యోగి చేసిన పోస్టు వైరల్ అవుతోంది. 

తాము న్యాయం కోసం మాత్రమే పోరాడుతున్నామని, తెలుగు రాష్ట్రాల్లో మిలియన్ల కొద్దీ ఐటీ ఇంజినీర్లకు బాటలు వేసిన నాయకుడి కోసం పోరాడుతున్నామని, ఆయనను కాపాడుకోలేకపోతే తమకు సామాజిక బాధ్యత ఉందని చెప్పుకోవడంలో అర్థం ఏముంటుందని ప్రశ్నించాడు. అంతేకాదు, సర్క్యులర్ జారీ చేసిన మిమ్మల్ని చూసి జాలిపడుతున్నానంటూ చేసిన ఆ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు అనూహ్య మద్దతు లభిస్తోంది.

Related posts

 డాబర్ తేనెలో కేన్సర్ కారకాలు ఉన్నాయా..? కంపెనీ ఏం చెబుతోంది?

Ram Narayana

అద్వానీని కలిసి అభినందనలు తెలిపిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ…

Ram Narayana

బీహార్ లో దారుణం…జర్నలిస్ట్ ను కాల్చి చంపిన దుండగులు …

Ram Narayana