Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మేము బీఆర్ యస్ కు ఎప్పుడు అంటకాగలేదు …కూనంనేని..

మేము బీఆర్ యస్ కు ఎప్పుడు అంటకాగలేదు …కూనంనేని
మునుగోడులో మేము లేకపోతె బీఆర్ యస్ గెలిచేది కాదు
సిపిఐ ,సిపిఎం కలిసే పోటీచేస్తాయి….కూనంనేని …
కాంగ్రెస్ కూడా పొత్తుల కోసం మాతో మాట్లాడుతుంది…
బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి వచ్చే శక్తులతో పనిచేస్తాం
చంద్రబాబు అయినా …కవిత అయినా అరెస్టుల విషయంలో రాజధర్మాన్ని పాటించాలి

తమపార్టీ బీఆర్ యస్ కు ఎప్పుడు అంటకాగలేదని ,మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల సహకారం ,మద్దతు లేకుండా బీఆర్ యస్ గెలిచేది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు .శనివారం సిపిఐ ఖమ్మం జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ యస్ వైఖరిపై మండి పడ్డారు .బీఆర్ యస్ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక చర్యలను తాము మొదటి నుంచి ఖండిస్తున్నామని తెలిపారు . బీఆర్ యస్ ,బీజేపీ తో మెతక వైఖరి కలిగి ఉందని అభిప్రాయపడ్డారు . మునుగోడు ఎన్నికల విషయంలో కమ్యూనిస్టులు తీసుకున్న స్టాండ్ సరైనదేనని అన్నారు . తాము నాడు బీఆర్ యస్ కు మద్దతు ఇవ్వకపోతే బీజేపీ గెలిచేది నేడు రాష్ట్రంలో తామే ప్రత్యాన్మాయం అని చెప్పేవారని అనేక మంది బీజేపీలో చేరేవారని అన్నారు . కాంగ్రెస్ పార్టీ కూడా తమతో పొత్తులకు ముందుకు వస్తుందని అయితే చర్చలు అనేది పరస్పర గౌరవప్రదంగా ఉండాలని మొదటినుంచి తాము చెపుతున్నామని అన్నారు .

కాంగ్రెస్ పార్టీ తమతో గౌరవప్రదమైన అంగీకారానికి రాకపోతే తమదారి తమదేనని అన్నారు .
కాంగ్రెస్ తో పొత్తు లేకపోతె రెండు కమ్యూనిస్టులు కల్సి పోటీచేస్తాయని ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు .అయితే కాంగ్రెస్ తో చర్చలు కొనసాగుతున్నందున వారితో కల్సి పోటీచేయడమా …? లేక లెఫ్ట్ పార్టీలు కల్సి ఎన్నికల్లోకి వెళ్లడమా అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు … పరిస్థితులను బట్టి పొత్తులపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు .సిపిఐ , సిపిఎం పార్టీలు కచ్చితంగా కలిసే ప్రయాణము చేస్తాయని తెలిపారు . తాము పోటీ చేసే స్థానాలు అభ్యర్థులపై అక్టోబర్ మొదటి వారంలో ప్రకటిస్తామని చెప్పారు .

కవితకు ఈడీ నోటీసులు , చంద్రబాబు అరెస్ట్ పై ఆయన స్పందిస్తూ ఎవరు అధికారంలో ఉన్న రాజధర్మాన్ని పాటించాలని హితవు పలికారు … ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకుండా చంద్రబాబు అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు …అయితే ఎవరు ప్రజల సొమ్మును లూటీ చేసిన తగిన శిక్ష పడాలని అన్నారు .

Related posts

స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకు ఇవ్వాలంటూ ప్రగతిభవన్ కు సర్పంచ్ నవ్య

Ram Narayana

రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన వద్దిరాజు రవిచంద్ర, తాతామధు

Ram Narayana

జనసేనతో కలిసి పని చేయండి: కిషన్ రెడ్డికి అమిత్ షా సూచన

Ram Narayana

Leave a Comment