Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నారా లోకేశ్ లేఖ రాసినందుకే జైల్లో రాత్రి పూట రౌండ్ వేశాను: డీఐజీ రవి కిరణ్

  • రాజమండ్రి సెంట్రల్ జైలు తాత్కాలిక ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా రవి కిరణ్
  • చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే ఆయనను నియమించారని విపక్షాల ఆరోపణ
  • నిబంధనల మేరకు భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తును తిరస్కరించామని వెల్లడి

ఏపీ జైళ్ల శాఖ కోస్త్రాంధ్ర డీఐజీ ఎంఆర్ రవికిరణ్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రవికిరణ్ బంధువు. మరోవైపు జైల్లో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా నియమించారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవికిరణ్ స్పందిస్తూ… అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులతో సంబంధం ఉంటుందని… అంతమాత్రాన అందరూ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తారనడం సరికాదని చెప్పారు. 

చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు తనను సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా నియమించారనే ఆరోపణలు అసత్యమని అన్నారు. చంద్రబాబు భద్రతపై నారా లోకేశ్ అనుమానాలను వ్యక్తం చేయడం వల్లే తనకు సెంట్రల్ జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా తాత్కాలిక బాధ్యతలను అప్పగించారని చెప్పారు. నిబంధనల మేరకు చంద్రబాబుతో ములాఖత్ కోసం ఆయన భార్య భువనేశ్వరి పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించామని తెలిపారు. చంద్రబాబుకు భద్రతా ఏర్పాట్లను పెంచాలని కోరుతూ లోకేశ్ లేఖ రాయడం వల్లే ఈ నెల 12న రాత్రిపూట జైల్లో రౌండ్ వేశానని చెప్పారు.

Related posts

అంతర్జాతీయ ప్రయాణాలు, పర్యాటకాభివృద్ధి సూచీలో పతనమైన భారత్ స్థానం!

Drukpadam

ఎన్నికల సంఘ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ,జనసేన ,బీజేపీ

Drukpadam

చలిపులి …వణుకుతున్న ఏజన్సీ ప్రాంతాలు ….

Drukpadam

Leave a Comment