Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

రాజ్యసభలో ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ సభ్యులు

  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
  • నేడు లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
  • ఈ నెల 21న రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు
  • 2010లోనే కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిందన్న ఖర్గే

రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. ఖర్గే ప్రసంగం పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తుండడం తెలిసిందే. ఇవాళ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ నెల 21న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, రాజ్యసభలో ఖర్గే దీనిపై ప్రసంగించారు. 

2010లోనే కాంగ్రెస్ సర్కారు మహిళా బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. వెనుకబడిన వర్గాల మహిళలకు కూడా అవకాశాలు దక్కాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు మహిళలను చిన్నచూపు చూస్తున్నాయని తెలిపారు. ప్రశ్నించలేని మహిళలకు అవకాశమిచ్చారని ఖర్గే విమర్శించారు. దాని వల్ల ఎవరికి ప్రయోజనం? అని ప్రశ్నించారు. ఖర్గే  వ్యాఖ్యలతో బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఆయన ప్రసంగం ఆపాలని పట్టుబట్టారు.

Related posts

హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుపై లోక్‌సభలో ఈటల ప్రశ్న!

Ram Narayana

మణిపూర్ హింస సిగ్గుచేటని అంగీకరిస్తున్నాం.. ప్రతిపక్షాలు ఈ అంశంపై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి!: అమిత్ షా

Ram Narayana

పక్క పక్కనే కూర్చొని… ఆప్యాయంగా పలకరించుకున్న మోదీ, రాహుల్ గాంధీ!

Ram Narayana

Leave a Comment