Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జనరల్ వార్తలు ...

జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది.. విడుదల చేసిన ఎన్‌టీఏ

  • తేదీలను వెల్లడించిన జాతీయ పరీక్షల సంస్థ
  • జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు మెయిన్ తొలి విడత పరీక్షలు
  • ఏప్రిల్ 1-15 మధ్య రెండో విడత పరీక్షలు
  • నీట్ తప్ప మిగతావన్నీ ఆన్‌లైన్ విధానంలోనే

జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది. జీఈఈ మెయిన్ రెండు విడతలతోపాటు నీట్, సీయూఈటీ యూజీ, పీజీ, యూజీసీ నెట్‌ తేదీలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) నిన్న వెల్లడించింది. నీట్ తప్ప మిగిలిన అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయి. వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష నిర్వహిస్తారు. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1-15 మధ్య జరుగుతాయి. ఆన్‌లైన్ పరీక్షల ఫలితాలను పరీక్షలు ముగిసిన మూడు వారాల్లోపు వెల్లడిస్తారు. 

వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది మే 5న నిర్వహించే నీట్ యూజీ-2024 ఫలితాలను జూన్ రెండోవారంలో ప్రకటిస్తారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలు వెల్లడించిన తర్వాత ఎంసెట్ తదితర పరీక్షల తేదీలను వెల్లడిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి తెలిపారు. 

కేంద్రీయ వర్సిటీల్లోని పీజీ సీట్ల భర్తీ కోసం మార్చి 11-28 మధ్య సీయూఈటీ పీజీ పరీక్ష నిర్వహిస్తారు. యూజీ సీట్ల భర్తీ కోసం మే 15-31 మధ్య సీయూఈటీ యూజీ పరీక్ష నిర్వహిస్తారు. పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం జూన్ 10-21 మధ్య యూజీసీ నెట్‌ నిర్వహిస్తారు.

Related posts

రాష్ట్ర మంత్రి పొంగులేటి మనుమరాలితో మథుర క్షణాలు…

Ram Narayana

టమాటో ధరలు ఢమాల్ ….రైతుల ఆందోళన …..!

Ram Narayana

ఇకపై వాట్సాప్ లో చాట్ జీపీటీ… !

Ram Narayana

Leave a Comment