Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ శాసనసభలో తీవ్ర గందరగోళం.. సభ వాయిదా

  • చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యుల ఆందోళన
  • స్పీకర్ మైక్ ను లాక్కునే ప్రయత్నం
  • సభకు హాజరుకాని సీఎం జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభ అట్టుడికింది. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంలోకి చొచ్చుకుపోయారు. ప్లకార్డులు చేతపట్టి స్పీకర్ ను చుట్టుముట్టారు. స్పీకర్ మైక్ ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై మంత్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీడియోలు ప్లే చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో, తమ వద్ద కూడా మీ వీడియోలు ఉన్నాయని, వాటిని తాము కూడా ప్లే చేస్తామని టీడీపీ సభ్యులు అన్నారు. ఈ గందరగోళం మధ్య సభను స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు సభకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కాలేదు.

అక్రమ కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు: బాలకృష్ణ

Never afraid of arrests says Balakrishna

అక్రమ కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. తమ అధినేత చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని, ఈ వ్యవహారాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పారు. ప్రభుత్వంపై పోరాటం ఇంతటితో ఆగేది కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని… దీన్ని చూసి ఓర్చుకోలేకే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా టీడీపీ వెంటే ఉన్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెపుతారని, టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని జోస్యం చెప్పారు.

 అంబటి రాంబాబుపై మీసం మెలేసి సవాల్ విసిరిన బాలకృష్ణ.. మీసాలు మెలేయడాలు సినిమాల్లో చేసుకోమన్న అంబటి!

ఈరోజు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. సభలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకెళ్లి, ఆయన మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరు స్పీకర్ పై దాడికి యత్నిస్తున్నట్టుగా ఉందని ఆయన అన్నారు. బల్లలు కొట్టాల్సింది ఇక్కడ కాదని, న్యాయస్థానాల్లో అని ఎద్దేవా చేశారు. 

దీంతో అంబటిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అంబటిపై మీసం మెలేయడంతో పాటు… ‘దమ్ముంటే రా అంబటీ’ అంటూ సవాల్ విసిరారు. దీనిపై అంబటి స్పందిస్తూ… మీసాలు మెలేయడాలు సినిమాల్లో చేసుకోవాలని సెటైర్ వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో, సభను స్పీకర్ తమ్మినేని 10 నిమిషాల పాటు వాయిదా వేశా

అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లిన టీడీపీ సభ్యులు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు టీడీపీ శాసనసభ, శాసనమండలి సభ్యులు పాదయాత్రగా వెళ్లారు. తొలుత వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి వారు నివాళి అర్పించారు. అనంతరం సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకు పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి పాదయాత్రలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా పాల్గొన్నారు.

మరోవైపు, అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై వాయిదా తీర్మానానికి టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అధికార, విపక్ష సభ్యుల అరుపులతో సభ గందరగోళంగా మారింది . దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభను వాయిదా వేశారు ..

ఏపీ శాసనమండలిలో కూడా తీవ్ర గందరగోళం.. సభ వాయిదా

  • ఉభయసభల్లో ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు
  • టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి ఛైర్మన్
  • టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ శాసనసభ సమావేశాల్లో దుమారం రేపుతోంది. ఉభయసభల్లోను టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీలో స్పీకర్ ఛైర్ ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు శాసనమండలిలో కూడా ఇదే సీన్ కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో, సభను మండలి ఛైర్మన్ వాయిదా వేశారు

Related posts

బాలకృష్ణకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్.. కోటంరెడ్డి, అనగాని సస్పెన్షన్

Ram Narayana

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం!

Ram Narayana

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ

Ram Narayana

Leave a Comment