Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ప్రియురాలి కోసం కొలంబియా వెళ్లి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఏపీ యువకుడు

  • స్పెయిన్ వెళుతున్నానని ఇంట్లోంచి బయల్దేరిన జి.కొండూరు యువకుడు
  • ప్రియురాలిని సర్ ప్రైజ్ చేస్తానంటూ సోదరికి చెప్పి కొలంబియా చేరిన వైనం
  • యువకుడు మృతి చెందాడంటూ ఫోన్ ద్వారా సమాచారం అందించిన ప్రేయసి

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు కొలంబియాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. జి.కొండూరుకు చెందిన బేతపూడి సుధీర్ కుమార్ (జోషి) ప్రభుత్వ స్కాలర్షిప్ సాయంతో స్పెయిన్ దేశంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఆ తర్వాత స్వస్థలానికి తిరిగివచ్చాడు. సుధీర్ కుమార్ గతంలో కొలంబియా జాతీయురాలు జెస్సికాతో సహజీవనం చేశాడు. 

ఈ నేపథ్యంలో, స్పెయిన్ వెళుతున్నానంటూ జి.కొండూరు నుంచి బయల్దేరిన సుధీర్ కొలంబియా వెళ్లినట్టు తెలిసింది. పుట్టినరోజు నేపథ్యంలో తన ప్రేయసి జెస్సికాను సర్ ప్రైజ్ చేద్దామని కొలంబియా వెళుతున్నానని సుధీర్ తన సోదరి జ్యోత్స్నకు తెలిపాడు. 

అయితే, ఐదు రోజుల కిందట జెస్సికా… జ్యోత్స్నకు ఫోన్ చేసి సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అంతేకాదు, చనిపోయే ముందు సుధీర్… భారత్ లోని తన సోదరుడితో మాట్లాడిన వీడియో కాల్ క్లిప్పింగ్ ను కూడా జ్యోత్స్నకు పంపించింది. 

కాగా, సుధీర్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సోదరుడికి, జెస్సికాతో స్పర్థలు ఉన్నాయని సోదరి జ్యోత్స్న చెబుతోంది. తమ ఆర్థికస్థితి అంతంతమాత్రమేనని, సుధీర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు సాయపడాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Related posts

హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ హ‌తం.. ధ్రువీక‌రించిన‌ ఇజ్రాయెల్‌!

Ram Narayana

బంగ్లాదేశ్ ప్రధానిగా ఐదోసారి పగ్గాలు చేబట్టనున్న షేక్ హసీనా

Ram Narayana

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్‌ ఔట్‌…

Ram Narayana

Leave a Comment