తెలంగాణ వార్తలు

మాదాపూర్‌లో రెండు భవనాలను క్షణాల్లో పేకమేడల్లా కూల్చేశారు

  • రహేజా మైండ్ స్పేస్‌లో రెండు భవనాల కూల్చివేత
  • ఏడు, ఎనిమిది బ్లాక్‌లలో రెండు నాలుగంతస్తుల భవనాలన్ని ఆధునిక సాంకేతిక విధానంతో కూల్చేసిన వైనం
  • పక్కన భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కూల్చివేత

హైదరాబాద్‌లోని మాదాపూర్ మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను ఆధునిక సాంకేతిక విధనాలతో కేవలం ఐదు నిమిషాల్లోనే కూల్చివేశారు. రహేజా మైండ్ స్పేస్‌లోని ఏడు, ఎనిమిది బ్లాక్‌లలో నాలుగు అంతస్తుల భవనాలు రెండు వేర్వేరుగా ఉన్నాయి. ఈ భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం కోసం రెండింటినీ కూల్చివేశారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెండు భవనాలను నిమిషాల్లోనే కూల్చేశారు. పక్కన ఉన్న భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ భవనాలను పేకమేడల్లా కూల్చేశారు.

Related posts

గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు కీలక ఆదేశాలు

Ram Narayana

ఔటర్ రింగ్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

Ram Narayana

ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీచేస్తే సరి లేకపోతె నాదే సీటు…రేణుకాచౌదరి

Ram Narayana