- జగన్ ఆలోచన ఆయనకే నష్టం చేస్తుందన్న హరగోపాల్
- జైలుకు వెళ్లడం వల్ల చంద్రబాబుకే లాభమని వ్యాఖ్య
- బాబును అరెస్ట్ చేసిన విధానం బాధాకరమని ఆవేదన
- టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ దేశ వ్యాప్తంగా పలు పార్టీలు, మేధావులు తమ స్పందనను తెలియజేశారు. తాజాగా ప్రొఫెసర్ హరగోపాల్ స్పందిస్తూ చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. చంద్రబాబును జైల్లో పెడితే రాజకీయంగా తనకు తిరుగు ఉండదని సీఎం జగన్ భావించారని… అయితే ఆయన ఆలోచన ఆయనకే నష్టాన్ని చేకూర్చబోతోందని చెప్పారు. జైలుకు వెళ్లడం వల్ల చంద్రబాబుకే లాభమని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు బీజేపీకి మద్దతిచ్చే సంస్థలుగా మారాయని విమర్శించారు.