Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ కు బై …కాంగ్రెస్ కు జైఅన్న బీఆర్ యస్ ఎమ్మెల్యే మైనంపల్లి…!

బీఆర్ యస్ కు బై …కాంగ్రెస్ కు జైఅన్న బీఆర్ యస్ ఎమ్మెల్యే మైనంపల్లి…!
ఈనెల 27 న మైనంపల్లి హస్తం గూటికి …ఢిల్లీలో చేరికకు ముహూర్తం
సీఎల్పీ నేత భట్టి ఆధ్వరంలో మైనంపల్లి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం
వారి ఆహ్వానాన్ని అంగీకరించినట్లు మైనంపల్లి వెల్లడి
మైనంపల్లితో పాటు తనయుడు రోహిత్ మరికొందరు నేతలు
రాష్ట్ర జిల్లా నేతల సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న మైనంపల్లి

బీఆర్ యస్ కు గుడ్ బై చెప్పిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు . గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న మైనంపల్లి బీఆర్ యస్ కు గుడ్ బై చెప్పారు . అదును కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్, బలమైన నేతగా ఉన్న మైనంపల్లిని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించింది . ఏఐసీసీ ఆదేశాల మేరకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్వయంగా మైనంపల్లి ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు . కాంగ్రెస్ ఆహ్వానాన్ని అంగీకరించిన మైనంపల్లి ఈనెల 27 ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు మీడియా కు తెలిపారు .తనతోపాటు తన కుమారుడు , ఇతర నేతలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర , కేంద్ర నాయకుల సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నామని అన్నారు . మైనంపల్లి కాంగ్రెస్ లో చేరడానికి అంగీకరించినందుకే భట్టి కృతజ్ఞతలు తెలిపారు . భట్టి వెంట మధు యాష్కీ , అంజాన్ కుమార్ యాదవ్ , మల్లు రవి తదితరులు మైనంపల్లి ఇంటికి వెళ్లారు ..

బీఆర్ యస్ మైనంపల్లికి ఎక్కడ చెడిందంటే …

బీఆర్ యస్ తన కుమారుడికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లికి బీఆర్ యస్ చెడింది.. సీఎం కేసీఆర్ అనుకూలంగా ఉన్న మంత్రి హరీష్ రావు అడ్డుపుల్ల వల్లనే తన కుమారుడికి సీటు ఇవ్వలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు . సీఎం కేసీఆర్ చెప్పిన మేరకే తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చానని తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు కుమారుడు నిర్వహిస్తున్నారని అన్నారు . మెదక్ పర్యటనకు వచ్చిన సందర్భంగా మీ అబ్బాయి చాల క్యూట్ గా ఉన్నాడని వాణ్ణి రాజకీయాల్లోకి తీసుకోని రమ్మని ,తాను చూసుకుంటానని చెప్పిన మీదటనే తీసుకొని వచ్చానని పలు సందర్భాల్లో చెప్పిన మైనంపల్లి బీఆర్ యస్ పై తన అసంతృప్తిని వెల్లడించారు . దీంతో బీఆర్ యస్ నేతలపై ప్రధానంగా మంత్రి హరీష్ రావు పై కారాలు మిరియాల నూరుతున్నారు . సిద్దిపేటకు వచ్చి తన తడాకా చూపిస్తానని ఛాలంజ్ చేశారు . పరిస్థితిని గమనించిన కేసీఆర్ విదేశాల్లో ఉన్న కేటీఆర్ ,ఎమ్మెల్యే కవితను రంగంలోకి దింపారు . హనుమంతరావు విమర్శలపై ఎదురుదాడి చేశారు . కొద్దికాలంగా మైనంపల్లి సైలంట్ కావడంతో అన్ని సర్దుకున్నాయని తిరిగి బీఆర్ యస్ నుంచి మల్కాజిగిరి అసెంబ్లీకి పోటీచేస్తారని అనుకున్నారు . అయితే మైనంపల్లి అనుయాయులపై కేసులు పెట్టడం బెదిరించడం చేస్తున్నారని తన కార్యకర్తలను రక్షించుకునేందుకు ఎంతదూరమైనా పోతానని ఇటీవలనే ఆయన అన్నారు .

Related posts

తెలంగాణలో పోటీ వద్దన్న టీడీపీ అధిష్ఠానం… పోటీ చేయాల్సిందేనంటున్న నేతలు!

Ram Narayana

తుమ్మల ఇంటికి క్యూకడుతున్న నేతలు …రాయబారాలా…? పరామర్శలా…!

Ram Narayana

 కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం…!

Ram Narayana

Leave a Comment