Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవితకు ఊరట

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత
  • తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సుప్రీంలో సవాల్ చేసిన కవిత
  • తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. మహిళనైన తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ స్పందిస్తూ… సుప్రీంకోర్టు తుది నిర్ణయం వచ్చేంత వరకు కవితకు సమన్లను జారీ చేయబోమని తెలిపింది.

Related posts

రాజీవ్ గాంధీ హంతకులకు స్వేచ్ఛను ప్రసాదించిన సుప్రీంకోర్టు!

Drukpadam

జగన్ అక్రమాస్తుల కేసు.. బీపీ ఆచార్యకు చుక్కెదురు…

Drukpadam

అమిత్ షా ఫోన్ చేస్తే ఒక్కటే చెప్పా.. చంద్రబాబు

Ram Narayana

Leave a Comment