Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జనరల్ వార్తలు ...

ఈయనకు రూ.100 కోట్ల ఆస్తి ఉందంటే ఎవరూ నమ్మరు!

  • తనవద్ద రూ.100 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని చెప్పిన వృద్ధుడు
  • వీడియోను షేర్ చేసిన రాజీవ్ మెహతా అనే వినియోగదారుడు
  • ఎల్ అండ్ టీ, అల్ట్రా టెక్ సిమెంట్స్, కర్ణాటక బ్యాంకు షేర్లు ఉన్నట్లు వెల్లడి

ఆయన వేషం, తీరు చూసి అందరూ సగటు మధ్యతరగతి మనిషి అని భావిస్తారు! కానీ వంద కోట్ల రూపాయల అధిపతి అని తెలిసి నోరెళ్లబెట్టడం ఖాయం!! ఎందుకంటే ఆ వృద్ధుడి నిరాడంబర జీవితం, ఆయన ధరించిన దుస్తులు, పూర్తి గ్రామీణ వాతావరణం… ఇవన్నీ చూస్తే ఆయన ఆస్తి రూ.100 కోట్లు అంటే నమ్మలేకపోవచ్చు. తన వద్ద రూ.100 కోట్ల షేర్లు ఉన్నాయని సదరు వృద్ధుడు ఓ వీడియోలో చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను రాజీవ్ మెహతా అనే ఎక్స్ వినియోగదారు ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రకారం అతని వద్ద రూ.100 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి.

రూ.80 కోట్ల విలువైన ఎల్ అండ్ టీ షేర్లు, రూ.21 కోట్ల విలువైన అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు, రూ.1 కోటి విలువైన కర్ణాటక బ్యాంకు షేర్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆయన సాధారణ జీవితం గడుపుతున్నారు. కేవలం డివిడెండ్‌తోనే తాను ఏడాదికి రూ.6 లక్షలు సంపాదిస్తున్నట్లు చెప్పారు.  

Related posts

పొంగులేటి ఇల్లు ,సంస్థలపై ముగిసిన ఐటీ దాడులు …

Ram Narayana

గంగానదిలో తేలుతూ వచ్చిన రాయి.. చూసేందుకు పోటెత్తుతున్న జనం

Ram Narayana

మధురైలో అగ్ని ప్రమాదం జరిగిన రైలు కోచ్ లో భారీగా నోట్ల కట్టలు

Ram Narayana

Leave a Comment