Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. స్పందించిన ఇస్రో చీఫ్

  • ప్రజ్ఞాన్ రోవర్ మేల్కొనకపోయినా ఇబ్బందేమీ లేదన్న ఇస్రో చీఫ్ సోమనాథ్
  • రోవర్ తన లక్ష్యాన్ని చేరుకుందని వ్యాఖ్య
  • ప్రస్తుతం ఎక్స్‌పోశాట్‌పై దృష్టి పెట్టినట్టు వెల్లడి

చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు. చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ఈ రోవర్ తన పని పూర్తి చేసిందని చెప్పారు. నిద్రాణస్థితి నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రముఖ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ఇస్రో చీఫ్ ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. 

ఖగోళాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్‌రే పోలారిమీటర్‌ శాటిలైట్‌పై (ఎక్స్‌పోశాట్) ప్రస్తుతం దృష్టి సారించినట్టు ఇస్రో చీఫ్ తెలిపారు. ఎక్స్‌పోశాట్‌తో పాటూ ఇన్‌శాట్-3డీని కూడా నవంబర్-డిసెంబర్ నెలల్లో ప్రయోగించనున్నట్టు వెల్లడించారు.

Related posts

భాష కోసం తమిళులు చనిపోయారు.. దాంతో ఆడుకోవద్దు.. భాషా వివాదంపై కమల హాసన్

Ram Narayana

అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌!

Ram Narayana

షాకిచ్చిన ఓయో.. ఇకపై అలాంటి వారికి నో ఎంట్రీ!

Ram Narayana

Leave a Comment