Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఉజ్వల సిలిండర్ రాయితీ రూ.300కు పెంపు, తెలంగాణకు పసుపు బోర్డు: కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

  • గ్యాస్ సిలిండర్ రాయితీ పెంపుతో ఉజ్వల సిలిండర్ ధర రూ.600కు తగ్గింపు
  • తెలంగాణలోని నిజామాబాద్‌లో పసుపు బోర్డుకు ఆమోదం
  • ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ఆమోదం

కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణకు పసుపు బోర్డు, గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే రాయితీని రూ.300 పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో పసుపు బోర్డు, ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జలాల వాటాను తేల్చాలని కృష్ణా ట్రైబ్యునల్‍‌ను ఆదేశించామన్నారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటా తేల్చాలని తెలంగాణ కోరుతోందని, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జలాల పంపిణీ చేయాలన్నారు.

ఉజ్వల గ్యాస్ సిలిండర్‌ రాయితీని రూ.300 పెంచాలని నిర్ణయించినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్రం ప్రస్తుతం రూ.200 రాయితీ ఇస్తుండగా, దీనిని రూ.300కు పెంచుతూ కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు. అంటే సిలిండర్ మార్కెట్ ధర రూ.903కు బదులు ప్రస్తుతం ఉజ్వల పథకం కింద రూ.703 చెల్లిస్తుండగా, తాజా నిర్ణయంతో రూ.603 చెల్లిస్తే సరిపోతుంది.

Related posts

మణిపూర్ లో రాహుల్ కాన్వాయ్ ను ఆపేసిన పోలీసులు…

Drukpadam

హిమాచల్ వరదలతో 74 మంది మృతి.. ఏకంగా రూ.10 వేల కోట్ల నష్టం!

Ram Narayana

ఆ పార్టీలతో నాకు సంబంధం లేదు.. నేనైతే అయోధ్య వెళుతున్నా.. తేల్చి చెప్పిన హర్భజన్‌సింగ్

Ram Narayana

Leave a Comment