Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బాధ్యతారహితంగా మాట్లాడితే పర్యవసానాలు ఉంటాయి: పవన్ వ్యాఖ్యలపై ఎస్పీ జాషువా స్పందన

  • పెడన సభలో రాళ్లదాడి చేయించేందుకు వైసీపీ ప్లాన్ వేసిందన్న పవన్
  • నోటీసులకు పవన్ రిప్లై ఇవ్వలేదన్న ఎస్పీ జాషువా
  • ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని సూచన

పెడనలో జనసేన నిర్వహించబోతున్న సభలో గూండాలు, క్రిమినల్స్ ద్వారా రాళ్లదాడి, గొడవలు చేయించేందుకు వైసీపీ ప్రభుత్వం పక్కాప్లాన్ వేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. దీంతో పవన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ… తమ నోటీసుకు పవన్ నుంచి రిప్లై రాలేదని చెప్పారు. పెడనలోని తోటమూల సెంటర్ లో బహిరంగసభకు పవన్ అనుమతి కోసం పవన్ దరఖాస్తు చేసుకున్నారని, ఆయన సభకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పవన్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు.

Related posts

రాహుల్ నేపాల్ పర్యటన కాంగ్రెస్ కు నష్టమట …బీజేపీకి ఎందుకు భాద …?

Drukpadam

రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు… బీఆర్ఎస్ నేతలపై ఫైర్

Drukpadam

ఇంజిన్ పై కవర్ లేకుండా ముంబయి నుంచి భుజ్ ప్రయాణించిన విమానం!

Drukpadam

Leave a Comment