Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అసెంబ్లీ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,17,17,389 మంది ఓటర్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,17,17,389 మంది ఓటర్లు
వీరిలో 1,58,71,493 మంది పురుషులు కాగా… 1,58,43,339 మంది మహిళలు
18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువ ఓటర్ల సంఖ్య 8,11,640

తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. వీరిలో 1,58,71,493 మంది పురుషులు కాగా… 1,58,43,339 మంది మహిళలు ఉన్నారు. 2,557 మంది ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరికి సర్వీస్ ఓటర్లను కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,32,727కి చేరుతుంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన జాబితాతో పోలిస్తే… ఓటర్ల సంఖ్య 5.8 శాతం పెరిగినట్టు సీఈసీ తెలిపింది. ఇదే సమయంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా 22,02,168 ఓట్లను తొలగించారు. వీరిలో బోగస్, డూప్లికేట్, చనిపోయిన ఓటర్లు ఉన్నారు. కొత్తగా 17.01 లక్షల మంది ఓటు హక్కును పొందారు.

ఓటర్లలో లింగ నిష్పత్తి 998:1000గా ఉంది. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువ ఓటర్లు 8,11,640 మంది ఉన్నారు. ఓట్ల నమోదుకు ఇంకా అవకాశం ఉందని… ఓటు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని సీఈసీ తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో, తక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో ఓట్లు ఉన్నారని వెల్లడించింది.

Related posts

వైసీపీ కంచుకోట‌లో టీడీపీ విజ‌యం…

Ram Narayana

సండ్ర గెలుపు కోసం సత్తుపల్లిలో గులాబీ కవాతు …

Ram Narayana

ఏపీలో టీడీపీ గెలుస్తోందంటూ ‘టైమ్స్ నౌ’ చెప్పడం నిజం కాదా?

Ram Narayana

Leave a Comment