కడపలో దారుణం.. భార్యాపిల్లల్ని కాల్చి చంపి, కానిస్టేబుల్ ఆత్మహత్య
స్థానిక కోఆపరేటివ్ కాలనీలో ఘటన
కడప రెండోపట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు
కుటుంబ కలహాలే కారణం!
కడపలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ తన కుటుంబాన్ని కాల్చి చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్థానిక కోఆపరేటివ్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకితో కాల్చి చంపాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.