Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అబుదాబి లాటరీలో రూ.34 కోట్ల జాక్ పాట్ కొట్టిన ఎన్నారై.. ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

అబుదాబి లాటరీలో రూ.34 కోట్ల జాక్ పాట్ కొట్టిన ఎన్నారై.. ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!
అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్ లాటరీని గెలుచుకున్న ముజీబ్ తెక్కే మట్టియేరి
ఖతార్ లో ఉంటున్న ముజీబ్
ఆన్ లైన్ లో లాటరీ టికెట్ కొనుగోలు

అదృష్టంలో దురదృష్టం అంటే ఇదేనేమో. అబుదాబిలో ఉంటున్న ఒక ఎన్నారై జాక్ పాట్ కొట్టాడు. అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్ లాటరీలో ఏకంగా 15 మిలియన్ దిర్హమ్ లు గెలుచుకున్నాడు. మన కరెన్సీలో ఇది అక్షరాలా రూ. 33.99 కోట్లు. ఖతార్ లో ఉండే ముజీబ్ తెక్కే మట్టియేరి అనే భారతీయుడికి ఈ జాక్ పాట్ తగిలింది. సెప్టెంబర్ 27వ తేదీని లాటరీ టికెట్ ను ఆయన ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు. ఆయన కొనుగోలు చేసిన 256 సిరీస్ 098801 నెంబర్ టికెట్ కు లాటరీ తగిలింది. లాటరీ గెలిచిన విషయాన్ని ఆయనకు చెప్పేందుకు నిర్వాహకులు ఫోన్ చేయగా అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. దీంతో ఇతర మార్గాల్లో ప్రయత్నించి లాటరీ డబ్బును ఆయనకు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

Related posts

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

Ram Narayana

కెనడా ఆరోపణలపై భారత్ కౌంటర్ అటాక్…

Ram Narayana

నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష.. మొట్టమొదటిసారి అనుమతినిచ్చిన యూఎస్ జడ్జి

Ram Narayana

Leave a Comment