- తలసాని పుట్టిన రోజు వేడుకల్లో ఘటన
- బొకే అందించలేదంటూ గన్ మెన్ పై ఆగ్రహం
- మంత్రి తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ పై చేయిచేసుకున్నారు. తలసాని పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ.. బొకే ఎక్కడంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయి గన్ మెన్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో షాక్ అయిన సదరు గన్ మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు. ఆపై వెనక ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హోంమంత్రి మహమూద్ అలీ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. మంత్రి తలసానిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఆయనకు అందించేందుకు తెచ్చిన బొకే కనబడలేదు.. బొకే ఏదంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహమూద్ అలీ, గన్ మెన్ ను దగ్గరకు పిలిచి చెంపపై కొట్టారు. ఇది చూసిన మంత్రి తలసాని హోంమంత్రికి సర్దిచెబుతుండడం వీడియోలో కనిపించింది. వెనక ఉన్న వారు అందించిన బొకేను తీసుకుని గన్ మెన్ దానిని హోంమంత్రికి ఇచ్చారు. కాగా, హోంమంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన రక్షణ బాధ్యతలు చూసే సిబ్బంది పట్ల హోంమంత్రి మహమూద్ అలీ ప్రవర్తించిన తీరు బాలేదని నెటిజన్లు మండిపడుతున్నారు.
నోరుమెదపని పోలీస్ సంఘాలు ….
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్తడే వేడుకుల సందర్భంగా హోమ్ మంత్రి తన గన్ మెన్ చెంప చెళ్లుమనిపించారు …ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది…అందరు హోమ్ మంత్రి చర్యను తప్పు పడుతున్నారు . ఒక భాద్యతగలిగిన పదవిలో ఉన్న మహమూద్ అలీ ఇలా చేయడం ఏమిటని అంటున్నారు ..అందరు చుస్తాండగానే చేయిచేసుకోవడంతో అక్కడ ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సహా అందరు నిచ్చేష్టులైయ్యారు .గన్ మెన్ అయోమయానికి గురైయ్యాడు …తన వెంట తెచ్చుకున్న బొకే వెంటనే ఇవ్వక పోవడం నేరమా అనే అంటున్నారు . బొకే మరొకరి చేతులో ఉండటంతో అది హోమ్ మంత్రికి చేతికి అందటం ఆలస్యం అయింది. దీనికే హోమ్ మంత్రికి ఇంత కోపం ఎందుకు అని ప్రశ్న వస్తుంది…పోలీసులపై జరిగిన దాడులకు వెంటనే స్పందించే పోలీస్ సంఘాలు ఈ విషయంలో నోరు మెదపలేదని విమర్శలు ఉన్నాయి. అయితే హోమ్ మంత్రి కదా వారి భాదలు వారికీ ఉంటాయని అంటున్నారు మరికొందరు …