Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ
  • తీర్పును సోమవారానికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
  • ప్రభుత్వం తరపున పొన్నవోలు, బాబు తరపున దూబే వాదనలు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం నాడు (9వ తేదీ) తీర్పును వెలువరిస్తామని జడ్జి ప్రకటించారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు కూడా సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. కోర్టులో ప్రభుత్వం తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు.

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కస్టడీ , బైలు పిటిషన్ పై శుక్రవారం విజయవాడ సి ఐ డి కోర్టులు వాదనలు ముగిశాయి…హై ప్రొఫైల్ కేసు కావడంతో దీనిపై ఆసక్తి నెలకొన్నది .సుప్రీంకోర్టు లో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో సి ఐ డి కోర్ట్ తీర్పును సోమవారానికి వాయిదా వేసింది…

13 మంది బెయిల్‌పై ఉన్నారని వాదనలు వినిపించాం: చంద్రబాబు లాయర్ ప్రమోద్ కుమార్ దూబే

Chandrababu lawyer on bail petition

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే అన్నారు. చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం తీర్పు ఇవ్వనుంది. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన అనంతరం దూబే మాట్లాడుతూ…  ఈ కేసులో ఇప్పటికే పదమూడు మంది బెయిల్‌పై ఉన్నారని తాము న్యాయస్థానంలో వాదనలు వినిపించినట్లు చెప్పారు.

ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎక్కడా, ఎలాంటి ఆధారాలు లేవన్నారు. గుజరాత్‌లో సీమెన్స్ కార్యకలాపాలపై ఇక్కడి అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే చంద్రబాబును విచారించారని, అరెస్టైన పదిహేను రోజుల తర్వాత మళ్లీ కస్టడీ కోరడం సరికాదన్నారు. కాగా చంద్రబాబు తరఫున ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

Related posts

అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో సీఎం జగన్ కు ఎదురుదెబ్బ

Ram Narayana

జైల్లో చంద్రబాబుకు టవర్ ఏసీ… ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

Ram Narayana

పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్ రౌత్ కు జైలు శిక్ష!

Ram Narayana

Leave a Comment