- కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేసిన డీకే అరుణ
- కేసీఆర్ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విన్నపం
- సీఎం కావాలనే తపనలో కేటీఆర్ ఉన్నారని విమర్శ
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆరోగ్యం బాగోలేదనే వార్తలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేసీఆర్ ఆరోగ్యంపై విపక్ష నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని ఒక్కసారైనా చూపించాలని బీజేపీ నేత బండి సంజయ్ ఇటీవల డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ మాట్లాడుతూ… కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి కావాలనే ఆశతో కేసీఆర్ ను నిర్లక్ష్యం చేయవద్దని కేటీఆర్ ను ఉద్దేశించి అరుణ అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తండ్రి ఆరోగ్యంపై ఆందోళన లేకుండా… సీఎం కావాలనే తపనలో కేటీఆర్ ఉన్నారని విమర్శించారు. బావ, బావమరుదులు కేటీఆర్, హరీశ్ లు పనులు పూర్తి కాకుండానే రంగులు వేయిస్తూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పెద్దాయనను ఫాంహౌస్ లో పడుకోబెట్టి.. కేటీఆర్, హరీశ్ లు పరుగులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎంపీ సంతోష్ కుమార్ ను కూడా దూరం పెడుతున్నారని విమర్శించారు.