Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మంలో పోటీకి పొంగులేటి జంకుతున్నారా….?

ఖమ్మంలో పోటీకి పొంగులేటి జంకుతున్నారా….?
మంత్రి పువ్వాడ అజయ్ పై పోటీచేసి గెలవలేమని అనుకుంటున్నారా …??
తమకు సీటు కావాలికానీ ఖమ్మం వద్దు అనే భయమెందుకు ..?
సేఫ్ సీట్ల కోసం పట్టుబడుతున్నారా …?
తుమ్మల పాలేరుపొంగులేటి కొత్తగూడెం,పాలేరు కోసం వత్తిడి
తమసంగతి ఏమిటంటున్న పార్టీలోని పాత కాపులు

ఎన్నికల షడ్యూల్ ఈరోజు లేదా రేపు విడుదల అవుతుందని అనుకుంటున్నారు . బీఆర్ యస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకొని పోతుంది …కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతుంది.. అభ్యర్థుల ప్రకటన ఇదిగో అదిగో అంటున్నారు . స్క్రినింగ్ కమిటీ సమావేశాలు రెండు మూడు సార్లు జరిగినప్పటికీ అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా మారింది… దీనికి తోడు బీసీ నేతలు తమకు 33 శాతం సీట్లు ఇవ్వాలని పట్టుబడుతుండగా , ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఆధ్వరంలో విద్యార్థిసంఘ నేతలు తమకు సీట్లు కేటాయించాలని ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిశారు . మరికొందరు ఆదివారం ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగి హల్చల్ చేశారు . ఇదేమంటే ఇది కాంగ్రెస్ కల్చర్ అని అంటున్నారు … ఒక పక్క సీట్ల కేటాయింపు లో కాంగ్రెస్ అధిష్టానం బిజీ బిజీ గా ఉంటె సీట్లు కావాలని కోరే నేతలు నియోజకవర్గాల్లో తమకంటే తమకే సీటు అని ప్రచారం మొదలు పెట్టారు …

ప్రధానంగా అసెంబ్లీ 10 సీట్లు ఉన్న ఖమ్మం జిల్లా గతంలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్కక్క సీటు మాత్రమే గెలిచింది .కారణాలు ఏమైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందనడంలో సందేహంలేదు …దీంతో ఎవరిని పోటీ పెట్టినప్పటికీ గెలుపు మాదే అనే నమ్మకంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి . అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది … ఖమ్మం నుంచి బీఆర్ యస్ అభ్యర్థిగా తిరిగి పోటీచేస్తున్న మంత్రి అజయ్ పై కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేసేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జంకుతున్నారా…? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి . వాస్తవానికి పార్టీ అండతోపాటు ఆయనకు ప్రజల్లో బలమైన నాయకుడిగా ముద్ర ఉన్నప్పటికీ ఖమ్మంలో పోటీచేసేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు . పువ్వాడ అజయ్ మీద ప్రజల్లో మిక్సుడ్ రెస్పాన్స్ ఉన్నా, గండరగండడు అనే పేరుంది …గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గం మీద పట్టు సంపాదించారు … సొంత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు … ఖమ్మం నగరంతోపాటు ,నియోజకవర్గాన్ని సుమారు 3 వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేశాడనే పేరుంది. ఓటర్లు అభివృద్ధికి పట్టం కడతారా ..? కాంగ్రెస్ ను ఆదరిస్తారా …అనేదే ఇక్కడ ప్రశ్న …

కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితేనే మంత్రికి సమఉజ్జిగా ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . లేదా తుమ్మల కూడా బలమైన అభ్యర్థే అనే అభిప్రాయాలూ ఉన్నాయి… ఒకవేళ వారు పోటీచేయకపోతే జావేద్ మైనార్టీ కోటా నుంచి ఉన్నారు ..తుమ్మల లేదా పొంగులేటి ఖమ్మంలో పోటీచేయకపోతే మంత్రి మీద పోటీకి భయపడుతున్నారని అపవాదును మూటకట్టుకోవడం ఖాయం…వారు కాకపోతే మంత్రి విజయం నల్లేరు మీద నడకేనని అంటున్నారు పరిశీలకులు …మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం నుంచి గత రెండు సార్లు విజయం సాధించారు . మొదటిసారి 2014 లో కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి గెలుపొందుగా ,రెండవసారి బీఆర్ యస్ టికెట్ పై పోటీచేసి గెలుపొందారు . అయితే పువ్వాడ అజయ్ మొదటిసారి హస్తం గుర్తుపై గెలుపొందగా రెండవసారి బ్యాలట్ లో హస్తం గుర్తు లేదు …ఈ రెండు పర్యాయాలు రాజకీయ ఉద్దండులు అయిన తుమ్మల నాగేశ్వరరావు , నామ నాగేశ్వరరావు లను ఓడించారు .ఇప్పుడు మంత్రి అజయ్ పై తాను పోటీచేసి ఓడిపోతే రాజకీయంగా బలహీనపడతాననే పొంగులేటి అభిప్రాయపడుతుండవచ్చు …అంతే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికార బీఆర్ యస్ కు చెందిన ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనని శపధం చేసిన పొంగులేటి తానే స్వయంగా ఓడిపోతే రాజకీయ విమర్శలను తట్టుకోవడం కష్టం అవుతుంది…అందుకే ఆయన ముందు జాగ్రత్త చర్యగా సేఫ్ సీటు చూసుకుంటున్నారని అభిప్రాయాలూ ఉన్నాయి…ఆయన ఖమ్మం కాకుండా కొత్తగూడెం , లేదా పాలేరు నుంచి పోటీచేయాలని ఆశక్తిగా ఉన్నారు .మూడు సీట్లలో కట్చిఫ్ వేశారు … పాలేరు సీటును మాజీమంత్రి తుమ్మల గట్టిగ ఆశిస్తున్నారు . అసలు ఆయన పాలేరు నుంచి పోటీచేయాలని పట్టుదలతోనే కాంగ్రెస్ లో చేరారని అందువల్ల పొంగులేటి పాలేరు ఎందుకు అడుగుతున్నారో తమకు అర్ధం కావడంలేదని తుమ్మల అనుయాయులు అంటున్నారు . గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కడగాలనే ఉద్దేశంతో తాను తిరిగి పోటీచేస్తున్నానని అందుకే కాంగ్రెస్ లో చేరానని తుమ్మల కుండబద్దలు కొట్టి చెపుతున్నారు . ఇక కొత్తగూడెం సీటు బీసీ అభ్యర్థికి ఇచ్చే ఆలోచనలతో పార్టీ ఉంది..లేదా సిపిఐకి కేటాయించవచ్చు ..అప్పుడు పొంగులేటి తనకు ఇష్టం లేకపోయినా అనివార్యంగా ఖమ్మం సీటు పోటీచేయని తప్పని పరిస్థితి ఏర్పడుతుంది… పొంగులేటి పాలేరు పై ద్రుష్టి సారించి తిరుగుతున్నారు . స్వయంగా ఆయన తమ్ముడు ప్రసాదరెడ్డిని గ్రామాల్లో తిప్పుతున్నారు . అటు పొంగులేటి ఇటు తుమ్మల పాలేరులో తిరుగుతుండటంతో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నియోజక ఇంచార్జి రాయల నాగేశ్వరరావు కొత్తగా పార్టీలో చేరిన నేతలపై గుర్రుగా ఉన్నారు .

తుమ్మలను ఖమ్మం లో పోటీచేయాలని కొందరు ఆయన హితులు సన్నిహితులు వత్తిడి తెస్తున్నారు . అయితే తుమ్మల కూడా ఈ విషయంలో ఎటు తేల్చుకోలేక పోతున్నారు . కొత్తగా పార్టీలో చేరిన పొంగులేటి ,తుమ్మల పోటీ విషయంలో అధిష్టానం పెద్దలు చర్చించినట్లు సమాచారం …సమావేశంలో ఏ నిర్ణయం జరగలేదు …దీంతో ఎవరికీ వారు పాలేరు తమదే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు ..నిజంగా పాలేరులో కాంగ్రెస్ పోటీచేస్తుందా..? లేక పొత్తులో భాగంగా సిపిఎం కు కేటాయిస్తారా …? అనే సందేహాలు లేకపోలేదు . సిపిఎం,సిపిఐ లు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నందున తాము కోరే ఒకటి అర సీట్లు కాంగ్రెస్ కేటాయిస్తుందని నమ్మకంతో ఉన్నాయి.. దీంతో కాంగ్రెస్ ఆశావహుల నిరాశ చెందక తప్పని పరిస్థితి .. రాష్ట్రం సంగతి తర్వాత ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారె అవకాశాలు ఉన్నాయి…

Related posts

కాంగ్రెస్ కు 80 సీట్లు దాటడం ఖాయం… మల్లు భట్టి విక్రమార్క!

Ram Narayana

తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో 6 గ్యారంటీ పథకాలు ప్రకటించిన సోనియా….

Ram Narayana

కరటక దమనకులు” అంటే ఏమిటి…? కేసీఆర్ పద ప్రయోగంపై ఆరా ..!

Ram Narayana

Leave a Comment